ఈ వారం విడుదల కాబోతున్న టిల్లు స్క్వేర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్ లైన్ లో మొదలైపోయాయి. ప్రధాన కేంద్రాల్లో ఇప్పటికే మంచి జోరు కనిపిస్తుండగా ఇతర సెంటర్స్ రిలీజ్ రోజు నాటికి ఫస్ట్ డే హౌస్ ఫుల్స్ పడటం ఖాయమే. రెండేళ్లకు పైగా దీనికోసమే కేటాయించిన సిద్దు జొన్నలగడ్డ ఈ సీక్వెల్ కి దర్శకుడిని మార్చడానికి కూడా వెనుకాడలేదు. మల్లిక్ రామ్ కు ఇచ్చిన బాధ్యతలకు ఎంత వరకు న్యాయం జరిగిందో శుక్రవారం తేలిపోతుంది. అగ్రెసివ్ ప్రమోషన్లకు వెళ్లకుండా టిల్లు స్క్వేర్ బృందం కూల్ గా వెళ్తోంది. థియేట్రికల్ బిజినెస్ గురించిన టాక్ ఆల్రెడీ హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉండగా టిల్లు స్క్వేర్ నిడివి క్రిస్పీగా కేవలం 1 గంట 58 నిమిషాలకు ఫైనల్ చేశారని సెన్సార్ టాక్. అంటే రెండు గంటలలోపే అన్న మాట. కంటెంట్ బాగుంటే మూడు గంటలు చూపించేందుకు కూడా వెనుకాడని ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత షార్ట్ లెన్త్ అంటే ఆశ్చర్యమే. అయితే అనవసర సన్నివేశాలు లేకుండా, కథనం వేగంగా జరిగేలా ఇలా ప్లాన్ చేశారని వినికిడి. దీని వల్ల కలిగే పెద్ద లాభం ఏంటంటే ఎగ్జిబిటర్లు ఎక్స్ ట్రా షోలు వేసుకోవడమే కాక వేరే సినిమాలకు కూడా కేటాయించేందుకు వెసులుబాటు దొరుకుతుంది. పైగా ప్రదర్శనలు స్పీడ్ గా అయిపోతాయి.
టాక్ కనక పాజిటివ్ గా వస్తే టిల్లు స్క్వేర్ కు కనీసం రెండు వారాలు తిరుగు ఉండదు. ఫ్యామిలీ స్టార్ కుటుంబ ప్రేక్షకులను ఎక్కువ లాగినా సరే సిద్దు మార్క్ టైమింగ్ యూత్ ని తనవైపు రాబట్టుకుంటుంది. స్పెషల్ ప్యాకేజ్ గా అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షో ఆకర్షణ కానుంది. పృథ్విరాజ్ సుకుమారన్ గోట్ లైఫ్ ఆడు జీవితం, హాలీవుడ్ మూవీ గాడ్జిల్లా కాంగ్ న్యూ ఎంపైర్ పోటీలో ఉన్నప్పటికీ ఆడియన్స్ ఫస్ట్ ఛాయస్ టిల్లు స్క్వేర్ కానుంది. నిర్మాత నాగవంశీ ఈసారి ఎక్కువ స్టేట్ మెంట్స్ ఇవ్వకుండా కంటెంట్ మాట్లాడాలనే ఉద్దేశంతో సినిమాను ఓవర్ ఎక్స్ పోజ్ చేయడం లేదు. ఇదీ మంచిదే.
This post was last modified on March 25, 2024 10:52 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…