నార్కోటిక్స్ బ్యూరో విచారణలో రియా చక్రవర్తి ఎనభై శాతం బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించిందని, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‍కి సమన్లు ఇచ్చిందని వార్తల్లో వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అంత రచ్చ జరుగుతోన్నా కానీ రకుల్ లేదా సారా స్పందించలేదు. బహుశా వాళ్లు ముందు కాదని, తర్వాత నిజంగా విచారణకు హాజరు కావాల్సి వస్తే మీడియాలో ఆగం ఆగం అయిపోతుందని భయపడి వుంటారు.
అయితే ఎన్‍సిబి ప్రకటనలో అలాంటి లిస్టేమీ తయారు చేయలేదని, ఎవరికీ సమన్లు పంపలేదని స్పష్టం చేసింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ సేఫ్ అని తేలిపోయింది. నిన్నంతా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ప్రముఖంగా ట్రెండ్ అయింది. కొన్ని వార్తాసంస్థలయితే ఒక అడుగు ముందుకెళ్లి క్రిష్ సినిమా షూటింగ్ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ వెళ్లిపోయిందని, లాయర్లను వెతుక్కునే పనిలో పడిందని రిపోర్ట్ చేసాయి.
ఇదిలావుంటే రియా చక్రవర్తికి సపోర్ట్ అన్ని వైపుల నుంచీ పెరుగుతోంది. తన ప్రియుడు డ్రగ్స్కి బానిస అయితే ఈమె మూల్యం చెల్లించాల్సి రావడమేంటని, సతీ సహగమనానికి, దీనికీ తేడా ఏముందని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచం అంతా ఏకమై తనపై దాడి చేస్తోన్నా తొణకని ఆమె తెగువను మహిళా రైటర్లు తెగ పొగిడేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates