అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో విజయ్ దేవరకొండ తొలిసారి నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. గీత గోవిందం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పరశురామ్.. విజయ్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ మూవీకి ఫ్యామిలీ స్టార్ అనే ఆసక్తికర టైటిల్ పెట్టాడు పరశురామ్. ఐతే ఈ టైటిల్ విజయ్‌ని పెద్ద స్టార్ అని ప్రూవ్ చేయడానికి పెట్టింది కాదని అంటున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ టైటిల్ వెనుక కథేంటో ఆయన తెలుగు సినీ జర్నలిస్టుల సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పంచుకున్నాడు.
ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ గురించి జనాలు ఏదేదో అనుకుంటున్నారు. ఐతే ఇది విజయ్ పెద్ద స్టార్ అని చెప్పడానికి పెట్టిన టైటిల్ కాదు. ఫ్యామిలీ కోసం కష్టపడే హీరో కథ ఇది. ఎక్కడెక్కడో ఉంటూ కష్టపడుతూ ఫ్యామిలీని గొప్ప స్థాయికి తీసుకెళ్లడానికి ఎంతో కష్టపడుతుంటారు. అలాంటి వాళ్లందరూ ఫ్యామిలీ స్టార్లే. నాతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన నారాయణమూర్తి లాంటి వాళ్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక స్థాయికి చేరుకుని ఫ్యామిలీని మంచి స్థాయిలో నిలబెట్టాం. మీలో కూడా అందరూ ఇలా ఫ్యామిలీ కోసం కష్టపడుతున్న వాళ్లే. కాబట్టి మనందరం ఫ్యామిలీ స్టార్లమే. ఇలాంటి వాళ్లను హీరోలుగా చూపించే ఉద్దేశంతోనే మా సినిమాకు ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ పెట్టాం. మా సినిమాలో కూడా హీరో ఫ్యామిలీ కోసం కష్టపడే స్టారే. అంతే తప్ప ఈ టైటిల్ వెనుక వేరే ఉద్దేశం లేదు అని దిల్ రాజు తెలిపాడు.
విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 23, 2024 12:30 am
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…
అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…
ఒకే ఏడాది రెండు రిలీజులతో అభిమానులను ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ గ్యాప్ లో మూడో సినిమాతో…
రామాయణం నేపథ్యంలో ఇప్పటికే ఇండియాలో బహు భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఆ కథకు ఇప్పటికీ డిమాండ్ తక్కువేమీ…