యాక్షన్ విజువల్స్, స్టయిలిష్ మేకింగ్ కి పేరొంది తీసినవన్నీ బ్లాక్ బస్టర్స్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు తమిళంలోనే కాదు తెలుగులోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే విజయ్ లియోలో ఎన్ని హెచ్చుతగ్గులున్నా మన ఆడియన్స్ బాగా ఆదరించారు. అయితే ఇతనిలో కేవలం టెక్నీషియన్ మాత్రమే ఉన్నాడనుకుంటే పప్పులో కాలేసినట్టే. హీరోగా లాంచ్ అయ్యే ఆలోచనలో ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ శృతి హాసన్ తో చేసిన ఒక రొమాంటిక్ సాంగ్ ప్రస్తుతం ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ని ఊపేస్తోంది. అలాని పూర్తి పాట కాదు. కేవలం 18 సెకండ్లున్న వీడియో ఇది.
అంతగా ఏముందబ్బా అంటే లోకేష్ కనగరాజ్, శృతి హాసన్ ల మధ్య కెమిస్ట్రీ మాటల్లో చెప్పేది కాదు. ఫుల్ సాంగ్ లో ఏ రేంజ్ లో ఉంటుందో మరి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని ఇనిమెల్ అనే వీడియో సాంగ్ తీశారు. విశేషం ఏంటంటే దీనికి భారీ సాంకేతిక వర్గం పని చేసింది. లిరిక్స్ స్వయంగా కమల్ హాసన్ రాసివ్వగా నిర్మాణం మొత్తం ఆయన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై జరిగింది. ఛాయాగ్రహణం కెజిఎఫ్ ఫేమ్ భువన గౌడ అందించగా ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. కాన్సెప్ట్, కంపోజింగ్ మొత్తం శృతినే.
దర్శకత్వం ద్వారకేష్ ప్రభాకర్ చూసుకున్నారు. పూర్తి వెర్షన్ యూట్యూబ్ లో 25 నుంచి ఫ్రీగా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. లోకేష్, అనిరుద్ రవిచందర్ లను హీరోగా పెట్టి ఒక సినిమా తీసే ప్లానింగ్ నెలల తరబడి జరుగుతోంది. అయితే రజనీకాంత్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న లోకేష్ ప్రస్తుతం యాక్టింగ్ చేసే పరిస్థితిలో లేడు. అందుకే ఆ ముచ్చటని ఇలా వీడియో రూపంలో తీర్చుకుంటున్నాడన్న మాట. లోకేష్ ఎక్స్ ప్రెషన్లు, స్టయిలింగ్ చూస్తుంటే క్రమంగా సంపూర్ణ హీరోగా మారినా ఆశ్చర్యం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. భాగ్యరాజా తరహాలో భవిష్యత్తులో రెండు బాధ్యతలు చూసుకుంటాడేమో.
This post was last modified on March 22, 2024 7:12 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్‌లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…