కోలీవుడ్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సహవాసం చేస్తూ ఉండే హీరో శింబు. ఒక దశ దాటాక అతడి వ్యవహారాలు శ్రుతి మించి పోయి అతడి సినిమాలు మధ్యలో ఆగిపోవడం, విడుదలకు నోచుకోకపోవడం, కమిటైన సినిమాలు పట్టాలెక్కకుండానే క్యాన్సిల్ అయిపోవడం.. ఇలా తయారైంది పరిస్థితి.
శింబు నుంచి ఒక హిట్ సినిమా వచ్చి కూడా చాలా కాలం అయిపోయింది. చివరగా అతను చేసిన ‘అత్తారింటికి దారేది’ రీమేక్ ‘వందా రాజాదా వరువేన్’ డిజాస్టర్ అయింది. ప్రస్తుతం అతను వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల దానికీ బ్రేక్ పడింది. కాగా ఇప్పుడు శింబు ఓ అరుదైన కాంబినేషన్లో సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలొస్తున్నాయి. లెజెండరీ నటుడు కమల్ హాసన్‌తో కలిసి శింబు నటించనున్నాడట.
కమల్ కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘సిగప్పు రోజాక్కల్’ ఒకటి. తెలుగులో ‘ఎర్ర గులాబీ’లు పేరుతో రిలీజై ఇక్కడా సూపర్ హిట్టయిందా చిత్రం. సైకో కిల్లర్ రామన్ రాఘవ్ జీవిత కథ ఆధారంగా భారతీ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 80ల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా స్ఫూర్తితో శింబు ‘మన్మథన్’ అనే సినిమా చేశాడు. తెలుగులో అది ‘మన్మథ’ పేరుతో రిలీజైంది. రెండు చోట్లా ఆ సినిమా సూపర్ హిట్. శింబు కెరీర్లో అతి పెద్ద విజయం అదే. ఇప్పుడు శింబు ‘సిగప్పు రోజాక్కల్’కు సీక్వెల్ చేయబోతున్నాడట.
ఇందులో కమల్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడట. ఒరిజినల్‌కు కొనసాగింపులా ఆయన పాత్ర ఉంటుందట. భారతీ రాజా తనయుడు, నటుడు అయిన మనోజ్ భారతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. ఐతే కమల్ ప్రస్తుతం ‘ఇండియన్-2’ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఎన్నికల్లో బిజీ అవుతాడు. ఆ తర్వాత శింబుతో కలిసి ‘సిగప్పు రోజాక్కల్’ సీక్వెల్లో నటించే అవకాశముంది.
This post was last modified on September 13, 2020 5:26 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…