Movie News

ఊర మాస్ ‘ఉస్తాద్’ చేతిలో గాజు గ్లాసు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త టీజర్ రానుందనే వార్త నిన్నటి నుంచే ఫ్యాన్స్ లో కొత్త ఉద్వేగాన్ని నింపింది. ప్రైమ్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా దీన్ని ప్లాన్ చేశారనే టాక్ వచ్చినా మొత్తానికి అభిమానులు కోరుకోని స్పెషల్ సర్ప్రైజ్ దక్కింది. ఎన్నికలు, జనసేన కార్యకలాపాల కోసం షూటింగ్ నుంచి పవన్ బ్రేక్ తీసుకున్నా తీసిన కొంత భాగంలోనే ఊర మాస్ కంటెంట్ రాబట్టుకున్నాడు హరీష్. గతంలో వదిలిన దానికి ఎక్స్ టెన్షన్ లా అనిపించినా అంతకు మించిన మసాలా అయితే దీంట్లోనే కనిపించింది.

కథకు సంబంధించిన క్లూస్ పెద్దగా ఇవ్వలేదు. లక్ష్మి నరసింహస్వామి రథం లాగుతుండగా కొందరు విద్రోహ శక్తులు అరాచకం చేయాలని చూడటం, వాటిని భగత్ సింగ్ అడ్డుకునే వైనం, పాతబస్తీ లాంటి ప్రాంతంలో ముస్లింల మధ్య కొందరు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తే వాళ్ళను కత్తి పట్టుకుని వేటాడ్డం ఇలా పవర్ ఫుల్ విజువల్స్ తో నింపేశారు. గాజు గ్లాసుని చులకనగా మాట్లాడిన గుండాకు వార్నింగ్ ఇస్తూ గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది, గ్లాస్ అంటే కనిపించని సైన్యం అంటూ చెప్పే డైలాగుల్లో పొలిటికల్ కౌంటర్లు కూడా ఉన్నాయి. ఖాకీ, పంచె రెండు గెటప్స్ లో పవన్ ని చూపించాడు.

ఈ లెక్కన తేరి రీమేక్ అయినా సరే గబ్బర్ సింగ్ తరహాలో ఒరిజినల్ ని మించేలా హరీష్ శంకర్ చాలా కీలకమైన మార్పులు చేసినట్టు టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈ వీడియోలో చూపించిన ఫైట్ ఎపిసోడ్స్ విజయ్ వెర్షన్ లో లేవు. కొత్తగా రాసుకున్నాడు. ఇదే తరహాలో కేవలం మెయిన్ పాయింట్ ని మాత్రమే తీసుకుని కొత్త ఫీల్ ఇస్తానని హరీష్ ముందు నుంచి చెబుతూనే వచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఒక ఫ్రేమ్ లో ఆమెనీ రివీల్ చేశారు. విడుదల తేదీ తేలాలంటే ఎలక్షన్లు అయ్యాకే ఆశించవచ్చు.

This post was last modified on March 19, 2024 5:48 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

48 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago