Movie News

‘కీడా కోలా’ గొడవ సద్దుమణిగింది

తెలుగు యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు తరుణ్ భాస్కర్. నటుడిగా కూడా అతడికి మంచి గుర్తింపే ఉంది. ఐతే తరుణ్ తన అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లుగా వేగంగా సినిమాలు చేయట్లేదు. దాదాపు పదేళ్ల కెరీర్లో అతను తీసింది మూడు చిత్రాలే. చివరగా చాలా గ్యాప్ తీసుకుని తరుణ్ తీసిన ‘కీడా కోలా’ అంచనాలను అందుకోలేకపోయింది.

నటుడిగా బలమైన ముద్ర వేసిన తరుణ్.. దర్శకుడిగా అంతగా మెప్పించలేకపోయాడు. ఈ సినిమా ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత టీంను ఓ వివాదం వెంటాడింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో ఈ సినిమాలో దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌తో ఒక పాట చేశారు. దీని మీద బాలు తనయుడు ఎస్పీ చరణ్ హర్టయ్యారు.

తరుణ్ భాస్కర్ అండ్ టీం తమను సంప్రదించకుండా ఇలా చేయడాన్ని తప్పుబడుతూ ఆయన లీగల్ యాక్షన్‌కు రెడీ అయ్యారు. కోటి రూపాయల నష్ట పరిహారం కూడా డిమాండ్ చేశారు. తరుణ్ అండ్ కో చేసింది తప్పే అయినా చరణ్ మరీ తీవ్రంగా రియాక్ట్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఐతే ఈ వివాదం ఇప్పుడు సద్దుమణిగింది.

తరుణ్.. చరణ్‌తో టచ్‌లోకి వెళ్లి వ్యవహారాన్ని సెటిల్ చేశారు. ఏఐ ద్వారా బాలు పాటను క్రియేట్ చేసిన విషయంలో తమకు, చరణ్‌కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని తరుణ్ తెలిపాడు.ఏఐ ద్వారా తాము కాకున్నా ఇలాంటి ప్రయత్నం వేరే వాళ్లు కూడా చేస్తారని.. దాన్ని నివారించలేమని తరుణ్ చెప్పాడు. ఐతే చరణ్‌తో మాట్లాడి ఈ విషయాన్ని సెటిల్ చేసినట్లు తరుణ్ తెలిపాడు. దీంతో ఈ గొడవ సుఖాంతం అయినట్లే.

This post was last modified on March 17, 2024 4:14 pm

Share

Recent Posts

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

10 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

42 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

1 hour ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago