ప్రభాస్ సినిమాలంటే వాయిదాలు పడటం చాలా మామూలే అన్నట్లు తయారైంది పరిస్థితి. బాహుబలి తర్వాత తన సినిమాల రేంజికి అనుకున్న సమయానికి పూర్తి చేసి విడుదల చేయడం అంటే కష్టమే. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్.. ఇలా ప్రతి చిత్రం వాయిదాలు పడ్డవే. ‘కల్కి’ మూవీ కూడా ఆల్రెడీ వాయిదా పడింది. ఈ ఏడాది సంక్రాంతికి అనుకున్న చిత్రాన్ని వేసవికి వాయిదా వేశారు.
వైజయంతీ మూవీస్ వారికి బాగా కలిసొచ్చిన మే 9వ తేదీని కొత్త రిలీజ్ డేట్‌గా ఎంచుకున్నారు. ఐతే ఆ డేట్‌కు సినిమా వస్తుందని పక్కాగా చెప్పలేని పరిస్థితి. భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడి ఉండి.. ఇంకా చిత్రీకరణ చివరి దశలో ఉన్న సినిమాను ఇంకో రెండు నెలల్లో విడుదలకు సిద్ధం చేయడం అసాధ్యం అనే భావిస్తున్నారు. కానీ టీం మాత్రం మే 9 రిలీజ్ విషయంలో ధీమాగా కనిపించింది.
ఐతే ప్రభాస్ అభిమానులు మాత్రం వేసవి విడుదల మీద చాలా తక్కువ ఆశలతో ఉన్నారు. దీనికి తోడు తాజా పరిణామాలు.. ఆ ఆశలు మరింత నీరుగారిపోయేలా చేశాయి. తాజాగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.
ఏపీ, తెలంగాణల్లో మే 13కు ఎన్నికల ముహూర్తం కుదిరింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరగనుండగా.. ఏపీలో దాంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మే రెండో వారానికి పీక్స్‌లో ఉంటుంది. నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉంచుకుని ‘కల్కి’ లాంటి భారీ సినిమాను రిలీజ్ చేసే సాహసం చేయరు. కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి మే 9న ‘కల్కి’ రిలీజ్ విషయంలో ఆశలు వదులుకోక తప్పదు.
This post was last modified on March 17, 2024 4:09 pm
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…