మూడేళ్ళుగా నిర్మాణంలో ఉన్న గేమ్ ఛేంజర్ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వైజాగ్ మండుటెండల్లో కీలక షెడ్యూల్ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా అని ముందే తెలిసినప్పటికీ కొన్ని కీలకమైన అంశాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.వాటిలో ప్రధానమైంది దర్శకుడు శంకర్ కథా నేపధ్యాన్ని ముగ్గురు రాజకీయ విలన్లను ఆధారంగా చేసుకుని తీస్తున్నారు. శ్రీకాంత్, ఎస్జె సూర్య, నవీన్ చంద్రలు ఆడే పొలిటికల్ గేమ్ ని రామ్ నందన్ ఐఏఎస్ ఎలా గెలిచాడనే పాయింట్ మీద నడుస్తుందట.
పలు ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ గమనించాల్సి. రామ్ చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక సామాన్యుడైన గొప్ప మనిషి అప్పన్న ప్రజల కోసం పార్టీ పెడితే పక్కనే ఉన్న శ్రీకాంత్ వెన్నుపోటు పొడిచి దాన్ని హస్తగతం చేసుకుంటాడు. ఇతని వారసుడు ఎస్జె సూర్య అంతకు మించిన స్వార్థంతో ఎత్తుగడలు వేస్తాడు. తనకు నవీన్ చంద్ర కొడుకా లేక తమ్ముడా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. జనం సొమ్మును పీల్చి పిప్పి చేసే ఈ రాక్షసులను ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చిన అప్పన్న కొడుకు రామ్ ఎలా కట్టడి చేస్తాడనేది ఊహించని స్క్రీన్ ప్లేతో ఉంటుందని వినికిడి.
కార్తీక్ సుబ్బరాజు అందించిన కథలో చాలా డ్రామా ఉంటుందని యూనిట్ టాక్. కియారా అద్వానీ చీరకట్టు అదీ చూస్తుంటే ఏదో కేవలం చరణ్ తో డాన్సులు ఆడి లవ్ చేయడానికే పరిమితం కావడం లేదని అర్థమవుతోంది. అంజలి, జయరాం, సునీల్ పాత్రలకు సైతం మంచి స్కోప్ దక్కిందట. దేశమంతా ఎన్నికల వాతావరణంతో వేడెక్కి ఉన్న ఇలాంటి టైంలో గేమ్ ఛేంజర్ వచ్చి ఉంటే బాగుండేది కానీ ఆలస్యం భరించక తప్పలేదు. అక్టోబర్ లేదా డిసెంబర్ ఈ రెండు ఆప్షన్లు సీరియస్ గా పరిశీలిస్తున్న దిల్ రాజు, శంకర్ లు వచ్చే వారంలోపు నిర్ణయం తీసుకుని మార్చి 27 ప్రకటించే ఛాన్స్ ఉంది.
This post was last modified on March 16, 2024 7:42 pm
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా…
టీడీపీ సీనియర్ నాయకురాలు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత… రాజకీయంగా చర్చనీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి…
గేమ్ ఛేంజర్ ఇంకా విడుదలే కాలేదు రామ్ చరణ్ అప్పుడే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించేశాడు. సుకుమార్ ప్రియ శిష్యుడు…