ఏదైనా సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒకే కథకు సంబంధించినదే ఉంటుంది. పాత్రల మధ్య లింకులను ఏదో ఒక రూపంలో దర్శకుడు ఎస్టాబ్లిష్ చేస్తాడు. అలా కాకుండా సంబంధం లేని స్టోరీలను చెప్పడానికి చూస్తే దాన్ని వెబ్ సిరీస్ అంటాం. కానీ టోవినో థామస్ కొత్త మూవీ అన్వేశిప్పిన్ కండెతుమ్ చూస్తే మాత్రం అభిప్రాయం మార్చుకోక తప్పదు. ఫిబ్రవరిలో థియేటర్ రిలీజ్ జరుపుకుని ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ తో సహా ప్రధాన భాషల్లో అందుబాటులోకి వచ్చింది. దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం కంటెంట్ లో ఉన్న వైవిధ్యం, దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు.
ఇది మూడు దశాబ్దాల వెనుక అంటే 1993లో జరిగినట్టు చూపిస్తారు. లవ్లీ అనే అమ్మాయి కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ మధ్యలో మాయమవుతుంది. ఈ కేసుని ఎస్ఐ ఆనంద్(టోవినో థామస్)కు అప్పజెబుతారు. ఓ బావిలో శవం దొరుకుతుంది. అనుమానితులను విచారించే క్రమం ఊహించని విధంగా స్వంత కుటుంబ సభ్యుల్లోనే ఒకరు హంతకులుగా తేలతారు. ఈ క్రమంలో జరిగిన ఒక పొరపాటు వల్ల ఆనంద్ అండ్ టీమ్ సస్పెన్డ్ అవుతారు. ఆరేళ్ళ క్రితం చనిపోయిన మరో అమ్మాయి కేసుని ఛేదించమని ఎస్పి వీళ్ళను వేరే ఊరికి పంపిస్తాడు. అక్కడా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి.
మర్డర్ చేసిన వాళ్ళను వెతికే క్రమంలో గ్రామస్థులు తిరగబడతారు. ఊహించని విధంగా నిందితుడు ఎవరో తెలిసేసరికి అందరికీ ఫ్యూజులు పోతాయి. హీరో పాత్ర మినహాయించి రెండు కథలకు ఏ సంబంధం లేకుండా దర్శకుడు డార్విన్ కురియకోస్ రాసుకున్న విధానం బోర్ కొట్టకుండా సాగుతుంది. తెలుగు అనువాదం కూడా నీట్ గా ఉంది. ఒకవేళ థియేటర్ కు వచ్చి ఉంటే ఇలాంటివి ఆడటం కష్టం కానీ చక్కగా ఇల్లు కదలకుండా చూసేందుకు క్రైమ్ లవర్స్ కి ఇది మంచి ఆప్షనే. కిల్లర్స్ ఎవరనేది ముందే గుర్తిస్తే మాత్రం మీ టేస్ట్ అమోఘం అనిపించేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. ట్రై చేయండి.
This post was last modified on March 13, 2024 9:45 am
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…