గత ఏడాది షారుఖ్ ఖాన్ తో జవాన్ రూపంలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అట్లీ డిమాండ్ మాములుగా లేదు. ఓ రెండేళ్ల తర్వాతైనా సరే చేద్దామనే స్టార్ హీరోలు బాలీవుడ్ లోనే పెరిగిపోతున్నారు. అయినా సరే టెంప్ట్ కాకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అల్లు అర్జున్ తో తనకో కమిట్ మెంట్ ఉన్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించలేదు కానీ గీతా ఆర్ట్స్, సన్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో భారీ ఎత్తున దీన్ని ప్లాన్ చేసుకున్నారు. పుష్ప 2 ది రూల్ అయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు కన్నా ముందు ఇదే చేయాలని బన్నీ మనసులో ఉన్న ఆలోచనట.
దీనికి గాను అట్లీ అక్షరాలా అరవై కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడనే వార్త చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక్క రాజమౌళిని మినహాయిస్తే ఇంకెవరూ ఇంత మొత్తంలో దక్షిణాది నుంచి పారితోషికంగా తీసుకోవడం లేదు. కానీ అట్లీ అదేమీ ఆలోచించడం లేదట. మార్కెట్ ఉంది, బ్రాండ్ వచ్చింది, కాంబో అనౌన్స్ మెంట్ కే క్రేజ్ పుడుతుంది, షూటింగ్ పూర్తయ్యేలోగా బయ్యర్లు క్యూ కడతారనే అంచనాల మధ్య తనకిచ్చే మొత్తం ఎక్కువేం కాదని సన్నిహితులతో అంటున్నాడట. నిజమో కాదో కానీ మొత్తానికి ఒక డైరెక్టర్ గా తన స్థాయి పెరిగిన మాట వాస్తవం.
షారుఖ్ విజయ్ కాంబోలో ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేసుకున్న అట్లీకి ఆ కోరిక ఇప్పట్లో నెరవేరేలా లేదు. ఇంకో రెండు సినిమాలు చేసి రాజకీయాల్లోకి వెళ్ళబోతున్న విజయ్ ఇతనికి డేట్లు ఇచ్చే పరిస్థితిలో లేడు. అందుకే అల్లు అర్జున్ తో ఒక కమర్షియల్ యాక్షన్ మూవీకి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని తెలిసింది. అడిగింది ఎక్కువ తక్కువ ఎంత ఇచ్చినా ఇది పట్టాలు ఎక్కడం ఖాయమేనని అల్లు కాంపౌండ్ న్యూస్. ఇంకోవైపు సందీప్ వంగా ప్రభాస్ స్పిరిట్ పూర్తి చేశాక యానిమల్ పార్కా లేక బన్నీతో సినిమానా అనేది అప్పటి పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకుంటాడు. ఇంకొంత కాలం ఈ సస్పెన్స్ తప్పదు.
This post was last modified on March 13, 2024 9:45 am
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…
అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…
ఒకే ఏడాది రెండు రిలీజులతో అభిమానులను ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ గ్యాప్ లో మూడో సినిమాతో…