‘వి’ సినిమాతో తన పంథా మార్చి యాక్షన్ జోన్‍లోకి అడుగు పెట్టిన ఇంద్రగంటి మోహనకృష్ణకు చేదు అనుభవం ఎదురయింది. అమెజాన్ ప్రైమ్‍లో విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి డిస్‍లైక్స్ వెల్లువలా వస్తున్నాయి.
ఇదిలావుంటే ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించిన తమన్ ‘రాచ్చసన్’, ‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ నుంచి స్కోర్ కాపీ చేసాడనే విమర్శలు వస్తున్నాయి. దానిపై తమన్ ఇంకా స్పందించలేదు కానీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అది కాపీ కాదని, కొన్ని సన్నివేశాలను బట్టి సంగీత దర్శకులు ఒకే రకమైన సౌండ్ ఇస్తారంటూ ఆ సౌండ్స్ తన నోటితోనే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసాడు. అయితే ఆయన ఇంటర్వ్యూ ఇంటర్నెట్ ట్రోల్స్ దృష్టిలో పడింది.
వెంటనే ‘కింగ్’ సినిమాలో బ్రహ్మానందం డైలాగులని తీసుకొచ్చి, ఈ ఇంటర్వ్యూకి జోడించి ఒక మీమ్ వీడియో వదిలేసారు. దాంతో ఈ ఇంటర్వ్యూ చూడని వారిని కూడా ఈ మీమ్ రీచ్ అయిపోయింది. ఆయన ఇద్దామని అనుకున్న ఎక్స్ ప్లెనేషన్ కరక్టేనేమో కానీ అది తమన్‍తో ఇప్పించినట్టయితే ఈ ట్రోల్స్ తప్పేవి. అసలే సినిమా బాలేదనే కామెంట్స్ కి తోడు బయట ఎంటర్‍టైన్‍మెంట్ లేక ఖాళీగా వున్న వారికి మీమ్ మెటీరియల్ ఇచ్చేస్తే ఎల్లా మరి?
Gulte Telugu Telugu Political and Movie News Updates