టాలీవుడ్లో ఒక ముఖ్యమైన వీకెండ్‌కు రంగం సిద్ధమైంది. ఈ శుక్రవారం రిలీజవుతున్న రెండు చిత్రాలు.. వాటి బృందాలకు ఎంతో కీలకం. ఈ రెండు చిత్రాల ఫలితం కోసం ఇండస్ట్రీ జనాలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాలే.. గామి, భీమా. ఇందులో మొదటి సినిమా చాలా ప్రత్యేకమైంది. విశ్వక్సేన్ అని అప్పుడే ఇండస్ట్రీలో తొలి అడుగులు వేస్తున్న కుర్రాడిని హీరోగా పెట్టి.. విద్యాధర్ కాగిత అనే కుర్రాడి నేతృతంలోని ఓ యువ బృందం కేవలం పాతిక లక్షలు చేతిలో పెట్టుకుని ఆరేళ్ల కిందట మొదలుపెట్టిన సినిమా ఇది.
ఐతే ఈ టీం విజన్, కష్టం, తపన.. ఇవన్నీ చూసి క్రౌడ్ ఫండింగ్ ద్వారా మరింత డబ్బులు సమకూరాయి. ఎన్నో కష్టనష్టాలకు ఏళ్ల తరబడి ప్రొడక్షన్, ప్రి ప్రొడక్షన్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. గామి టీజర్, ట్రైలర్ చూస్తే మాత్రం ఇది సెన్సేషన్ క్రియేట్ చేసే సత్తా ఉన్న సినిమాలా కనిపించింది. ఐతే ప్రోమోల్లో అద్భుతంగా అనిపించి.. సినిమాగా మెప్పించలేకపోయిన చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే ‘గామి’ తెరపై ఎలా ఉంటుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘గామి’ టీం కష్టం, తపన చూస్తే మ ాత్రం ఇది హిట్టవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.
ఇక ఈ వీకెండ్లో రాబోతున్న మరో తెలుగు చిత్రం ‘భీమా’ సక్సెస్ కావడం హీరో గోపీచంద్‌కు చాలా అవసరం. ఎప్పుడో 2014లో వచ్చిన ‘లౌక్యం’ తర్వాత గోపీకి సరైన సక్సెస్ లేదు. ‘గౌతమ్ నంద’ లాంటి మంచి ప్రయత్నాలు కూడా ఫలితాన్నివ్వలేదు. ఈసారి అతను కన్నడ దర్శకుడు హర్ష డైరెక్షన్లో ‘భీమా’ పేరుతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీ చేశాడు. దీని ట్రైలర్ చూస్తే మాస్‌కు విందులా అనిపించింది. కానీ మాస్ పేరుతో రొటీన్ అంశాలతో నింపేస్తే ఈ రోజుల్లో జనాలు చూసే పరిస్థితి లేదు. ఇంకేదో ప్రత్యేకత ఉండాలి. మరి గోపీ-హర్ష కలిసి ప్రత్యేకంగా ఏం చేసి మెప్పించారో చూడాలి.
This post was last modified on March 8, 2024 9:51 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…