సినిమా దర్శకుడిగానే కాదు బయట కూడా ప్రవర్తన, సూటిగా ఉండే మాట తీరుతో సందీప్ రెడ్డి వంగాకు చాలా స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అతను తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించి ఏడుకొండలవాడిని దర్శించుకుని వచ్చాడు. నిన్నటి దాకా నిండైన జుట్టుతో, భారీ మీసాలు గడ్డంతో అరోగంట్ హీరోకు అడ్రెస్ గా అనిపించిన సందీప్ హఠాత్తుగా జుత్తు లేకుండా గుండుతో కనిపించేసరికి ఫ్యాన్స్ షాక్ తిన్నారు. పైగా ఎలాంటి హడావిడి లేకుండా ఒక సామాన్యుడిలా వెళ్లి రావడం ఆశ్చర్యపరిచింది. ఎవరో గుర్తుపట్టి వీడియో తీసేదాకా అసలీ సంగతే ఎవరికీ తెలియదు.
ఇప్పుడిది ట్రెండింగ్ అవుతోంది. శివాజీలో రజనీకాంత్ ఫస్ట్ హాఫ్ లో జుత్తుతో కనిపించి చివరి గంట గుండుతో మేజిక్ చేస్తాడు. సందీప్ వంగా కూడా అచ్చం అదే తరహాలో యానిమల్ టైంలో హెయిర్ స్టైల్ తో ఉండి నెక్స్ట్ స్పిరిట్ తో గుండు బాస్ లా రచ్చ చేస్తాడని వీడియోలు ఎడిట్ చేసి మరీ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. యానిమల్ పార్క్ ని వాయిదా వేసుకుని సందీప్ వంగా ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ మీద పని చేస్తున్నాడు. ఈ ఏడాది చివరిలోగా షూటింగ్ మొదలుపెట్టాలని ప్రణాళిక వేసుకున్నారు కానీ ప్రభాస్ ఇతర కమిట్ మెంట్ల మీద ఇది ఆధారపడి ఉంది.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత సందీప్ వంగా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా తన కంటెంట్ మీద విమర్శలు చేస్తున్న వాళ్లకు మొహం వాచిపోయేలా ఇస్తున్న కౌంటర్లు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ మధ్య రచయిత జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలకు బదులుగా ప్రపంచంలోని బూతులన్నీ మీ కొడుకు నిర్మాతగా తీసిన మీర్జాపూర్ సిరీస్ లో ఉన్నాయని చెప్పడం ఓ రేంజ్ లో పేలింది. ఇలాంటి వాటి వల్లే సందీప్ వంగా ఫాలోయింగ్ ఆఫ్ లైన్ లోనూ ఓ రేంజ్ లో ఉంది. నిజమైన యాటిట్యూడ్ అంటే ఇదేనేమో.
This post was last modified on March 6, 2024 10:32 pm
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…