చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ప్లానింగ్ లో ఎలాంటి సమస్యలు రాకుండా షెడ్యూల్స్ వేసుకున్న టీమ్ దానికి అనుగుణంగానే చకచకా కానిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ టైం డిమాండ్ చేసే ఫాంటసీ మూవీ కావడంతో త్వరగా టాకీ పార్ట్, పాటలు పూర్తి చేసే ప్రణాళికతో సాగుతున్నారు. సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ దీన్ని రూపొందిస్తోందనే వార్త మెగా ఫాన్స్ కి మంచి జోష్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 10 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే టార్గెట్ ని చేరుకోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.
ఇందులో కథ ప్రకారం చిరంజీవికి అయిదుగురు చెల్లెళ్లు ఉంటారనే లీక్ ఆల్రెడీ బయటికి వచ్చింది. ఈషా చావ్లా, సురభి, ఆషిక రంగనాథ్ ఆ పాత్రల్లో కనిపిస్తారని తెలిసింది. మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్ లు కూడా ఉంటారట కానీ వాళ్ళు సిస్టర్సా లేక చిరు సరసన ఆడి పాడేందుకు తీసుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మెయిన్ హీరోయిన్ మాత్రం త్రిషనే. అందులో సందేహం లేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ చెల్లెళ్లకు జోడిగా నటించాల్సిన ప్రేమికులు, బావ పాత్రలకు తగిన ఆర్టిస్టులను వెతికే పనిలో టీమ్ బిజీగా ఉందట.. మూవీ రేంజ్ కి తగ్గట్టు క్యాస్టింగ్ ని సెట్ చేసుకోవాలి కదా.
కాస్త పేరు, గుర్తింపు ఉండి ఫామ్ తగ్గిన యూత్ హీరోలను ఈ క్యారెక్టర్ల కోసం తీసుకుంటారట. భోళా శంకర్ లో కీర్తి సురేష్ సరసన సుశాంత్ కనిపించినట్టు ఇప్పుడు కూడా అలాంటి కాంబోలు సెట్ చేసుకోవాలి. నవీన్ చంద్ర, రాజ్ తరుణ్ లాంటి వాళ్ళను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిసింది. నిడివి ఎక్కువ ఉండదు కాబట్టి దానికి అనుగుణంగానే చూసుకుంటారు. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఉన్నా సరే బింబిసార తరహాలో ఎమోషన్స్ కి సరైన ప్రాధాన్యం దక్కేలా సిస్టర్ సెంటిమెంట్ ని వశిష్ట చక్కగా డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. శివరాత్రికి ఒక పోస్టర్ వదిలే ఆలోచనలో యువి బృందం ఉంది.
This post was last modified on March 3, 2024 8:08 am
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…