నాలుగు దశాబ్దాలుగా హిందీ సినిమాల్లో అద్భుతమైన పాత్రలతో అలరిస్తూ వస్తున్నారు లెజెండరీ నటుడు అనిల్ కపూర్. ఒకప్పుడు ‘మిస్టర్ ఇండియా’ లాంటి చిత్రాలతో యువతను ఒక ఊపు ఊపిన ఆయన.. ఇప్పుడు క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్‌తో అదరగొడుతున్నారు. ‘నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్‌లో అనిల్ విలనీకి.. ‘యానిమల్’లో తండ్రి పాత్రలో ఆయన చూపించిన అభినయానికి ఫిదా అవ్వని వారుండరు.
లేటు వయసులో అదిరిపోయే పాత్రలతో సాగిపోతున్న అనిల్ కపూర్.. ఇండియన్ సినిమా అంతా ఒక్కటే అని.. ఇక బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని సంబోధించడం మానేయాలని అంటున్నారు. దక్షిణాది సినిమాలపై ఆయన ఒక ఇంటర్వ్యూలో ప్రశంసల జల్లు కురిపించారు. తన ఎదుగుదల సౌత్ సినిమాల నుంచే మొదలైందని ఆయన అన్నారు.
తెలుగులో బాపు దర్శకత్వంలో ‘వంశవృక్షం’, కన్నడలో మణిరత్నం డైరెక్షన్లో ‘పల్లవి అనుపల్లవి’ లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించాడు అనిల్. ఆ తర్వాత ఆయన బాలీవుడ్లో హీరోగా మంచి స్థాయికి ఎదిగారు. ఈ నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీని అనిల్ కొనియాడాడు.
“నాకు దక్షిణాది సినిమాలంటే చాలా ఇష్టం. నేను అక్కడి నుంచే నటుడిగా ఎదిగాను. ఆ తర్వాత దక్షిణాది చిత్రాల రీమేక్‌ల్లో నటించి బాలీవుడ్లో నిలదొక్కుకున్నాను. సౌత్‌లో అద్భుతమైన కథలు వస్తుంటాయి. ఇప్పుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పుష్ప లాంటి దక్షిణాది సినిమాలు దేశవ్యాప్తంగా అద్భుత విజయం సాధించాయి. అవి దేశాన్ని ఏకం చేశాయి. ఇక బాలీవుడ్ వెర్సస్ టాలీవుడ్ లాంటి మాటలు సరికాదు. భారతీయ సినిమాలను వేరు చేయకండి. అన్ని సినిమాలనూ కలిపి ఇండియన్ సినిమాగా చూడండి” అని అనిల్ స్పష్టం చేశాడు.
This post was last modified on March 1, 2024 9:58 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…