బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి తర్వాత ఎక్కువగా చర్చనీయాంశం అయిన పేర్లు.. రియా చక్రవర్తి, అంకితా లోఖండె. ఇందులో రియా సుశాంత్ చనిపోవడానికి ఏడాది ముందు నుంచి అతడి గర్ల్ ఫ్రెండ్. అంకితా ఏమో.. అతను టీవీ రంగంలో ఉన్నపుడు, ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ప్రేయసిగా ఉంది. మధ్యలో వీరికి బ్రేకప్ అయింది. కొన్నేళ్ల తర్వాత రియాతో బంధం మొదలుపెట్టాడతను.
సుశాంత్ సన్నిహితులందరి మాటల్ని బట్టి చూస్తే అంకితాతో ఉన్నపుడు సుశాంత్ చాలా సంతోషంగా ఉన్నాడు. రియా వచ్చాక అతను దారి తప్పాడు. రియాతో ఉన్న కాలంలోనే సుశాంత్ మానసిక సమస్యల బారిన పడ్డాడని, ఆమె అతణ్ని ఏదో చేసిందని అతడి దగ్గర మేనేజర్‌గా పని చేసిన వ్యక్తి ఆరోపించిన సంగతి తెలిసిందే. అంకితా గురించి పాజిటివ్ కామెంట్లు కూడా చేసింది అతనే.
కాగా ఇప్పుడు సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని రియానే స్వయంగా వెల్లడించడం, అతడి గురించి విచారణలో నెగెటివ్ కామెంట్లు చేయడం, రియా తండ్రి, లాయర్ కూడా సుశాంత్‌నేు డీఫేమ్ చేయడానికి ప్రయత్నిస్తుండటం తెలిసిందే. దీనిపై అంకితా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అది వైరల్ అవుతోంది. ఇందులో రియాకు ఆమె సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించింది. సుశాంత్ మానసిక స్థితి సరిగా లేదని, డిప్రెషన్లో ఉండగా తానే ట్రీట్మెంట్ ఇప్పించానని రియా అంటోందని.. అదే సమయంలో అతను డ్రగ్స్ తీసుకునేవాడని చెబుతోందని.. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటుంటే ఆమె ఎందుకు ఆపలేదని అంకిత ప్రశ్నించింది.
సుశాంత్‌ను ఎంతో గాఢంగా ప్రేమించానని చెబుతున్న రియా.. అతను డ్రగ్స్ తీసుకుంటుంటే ఎలా ఊరుకుందని ఆమె అడిగింది. ఇది నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కాదా అని ఆమె ప్రశ్నించింది. సుశాంత్ డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్న విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు చెప్పానంటున్న రియా.. డ్రగ్స గురించి ఎందుకు చెప్పలేదని ఆమె అంది. రియా సైతం డ్రగ్స్ తీసుకోవడాన్ని ఆస్వాదించిందని స్పష్టమవుతోందని అంకితా అంది. మరోవైపు సుశాంత్ హత్యకు గురయ్యాడని కానీ, అతడి మృతికి ఫలానా వ్యక్తి బాధ్యులు అని కానీ తాను ఏ రోజూ అనలేదని ఈ నోట్‌లో అంకిత స్పష్టం చేసింది.
This post was last modified on September 10, 2020 3:33 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…