ఇంకో పది రోజుల్లో విశ్వక్ సేన్ గామి థియేటర్లలో అడుగు పెట్టనుంది. వాస్తవానికి గ్యాంగ్ అఫ్ గోదావరి మార్చి 8 రావాల్సి ఉన్నా ఇంకా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల గామిని రీ ప్లేస్ చేస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యాకప్ దక్కడంతో మెల్లగా ప్రమోషన్లు ఊపందుకుంటున్నాయి. ఎల్లుండి ప్రసాద్స్ పీసీఎక్స్ బిగ్ స్క్రీన్ లో ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. దీని కోసం భారీ ఎత్తున పబ్లిసిటీ జరుగుతోంది. ఆరేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ డివైన్ థ్రిల్లర్ లో ఊహించని అంశాలు చాలా ఉంటాయని టీమ్ తెగ ఊరిస్తోంది. టీజర్ విజువల్స్ అలా ఉన్నాయి.
గామికి ఉన్న రిస్క్ ఒకటే. ఇది రెగ్యులర్ ఎంటర్ టైనర్ కాదు. మనిషి రూపంలో తిరిగే ఒక అద్భుత శక్తి అఘోరాగా మారే క్రమంలో తెలుసుకునే నిజాల ప్రయాణం. హైదరాబాద్ తో మొదలుపెట్టి హిమాలయాల దాకా ఎన్నో ఊళ్లు చేరుతుంది. గామిగా మారిన హీరో ఏ లక్ష్యంతో ఇదంతా చేశాడనే పాయింట్ మీద దీన్ని రూపొందించినట్టు ఇన్ సైడ్ టాక్. అయితే గామిలో ఎలాంటి కామెడీ ఉండదు. అక్కడక్కడా సున్నితమైన హాస్యం మాత్రమే జొప్పించారట. అధిక శాతం డ్రామా సీరియస్ గా, తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్ ఏర్పడేలా స్క్రీన్ ప్లే రాశారట.
క్యాస్టింగ్ గట్రా బాగానే ఉంది కానీ గామి కనక వర్కౌట్ అయితే ఈ తరహా కొత్త జానర్ కు దారులు తెరిచినట్టు అవుతుంది. గతంలో బాలా లాంటి కల్ట్ దర్శకులు నేనే దేవుణ్ణి లాంటి ప్రయోగాలు చేశారు కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు. గామి డైరెక్టర్ విద్యాధర్ మాత్రం కథనే నమ్ముకుని సంవత్సరాల తరబడి దీని మీద పని చేశారు. చాలా కాలం క్రౌడ్ ఫండింగ్ తోనే నిర్మాణం జరిగింది. విశ్వక్ సేన్ లుక్స్ ప్రస్తుతంతో పోలిస్తే కొంత పాతగా విభిన్నంగా ఉంటాయి. గోపిచంద్ భీమాతో తలపడుతున్న గామిలో చాందిని చౌదరి, అభినయ ఫిమేల్ లీడ్స్ గా నటించారు.
This post was last modified on February 27, 2024 3:57 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…