చరణ్ సినిమాలో హాట్ విలన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఐతే ఆ సినిమా విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతుండడం.. టీం నుంచి ఏ రకమైన అప్‌డేట్స్ లేకపోవడంతో అభిమానుల్లో ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది. అదే సమయంలో చరణ్ చేయబోయే కొత్త చిత్రం వారి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి.

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రానికి పని చేయబోతుండటం ఎగ్జైట్మెంట్ పెంచే విషయాలే. చరణ్ సరసన ఈ సినిమాలో జాన్వి కపూర్ కథానాయికగా నటించనున్న విషయం కూడా ఖరారైంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి కూడా ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.

‘యానిమల్’ సినిమాలో అబ్రార్ పాత్రతో సంచలనం రేపిన బాబీ డియోల్‌ను చరణ్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకు ఎంచుకోవాలని చూస్తున్నారట. ఆయనతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. బాబీ ఆల్రెడీ బాలయ్య సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నాడు. ‘యానిమల్’ రిలీజ్ కాకముందే అతనీ కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాత బాబీ డిమాండ్ బాగా పెరిగిపోయింది.

బాలీవుడ్ నుంచే కాక సౌత్ నుంచి కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. చరణ్-బుచ్చిబాబు సినిమా రేంజ్ దృష్ట్యా అందులో విలన్ పాత్ర చేయడానికి బాబీ కచ్చితంగా అంగీకరిస్తాడనే అనుకుంటున్నారు. ఉత్తరాంద్ర నేపథ్యంలో ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్ కోచ్ పాత్ర చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం ఉత్తరాంధ్రలో ఆడిషన్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే.