ప్రతి దర్శకుడికి సాంకేతిక బృందంలోని కొందరితో మంచి సింక్ కుదురుతుంది. ఒక్కసారి నచ్చేస్తే మళ్ళీ వదులుకునేందుకు ఇష్టపడరు. సుకుమార్, ఛాయాగ్రాయకుడు రత్నవేలు బాండింగ్ అలాంటిదే. వీళ్ళ బంధం ఆర్య నుంచే మొదలైంది. తన మొదటి విజయంలో భాగమైనప్పటి నుంచి సుక్కు అంత సులభంగా విడిచిపెట్టడం లేదు. జగడం, 1 నేనొక్కడినే ఫలితాలు నిరాశపరిచినా వాటి కెమెరా వర్క్ మీద నెగటివ్ రిమార్క్స్ రాలేదు. పైపెచ్చు సినిమాటోగ్రఫీకి సైమా అవార్డు దక్కింది. కుమార్ 21 ఎఫ్ ని తక్కువ బడ్జెట్ లో తీసినా నిర్మాతగా సుకుమార్ పెట్టిన ఖర్చు రత్నవేలు మీద మాత్రమే.
ఇక రంగస్థలం గురించి చెప్పనక్కర్లేదు. దానికొచ్చిన రికార్డులు, సృష్టించిన సునామి అంతా ఇంతా కాదు. కట్ చేస్తే పుష్పకు రత్నవేలు పని చేయలేదు. సరిలేరు నీకెవ్వరు. సైరా నరసింహారెడ్డి కమిట్ మెంట్స్ వల్ల కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోతున్న ఆర్సి 16కి రత్నవేలుని లాక్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఇండియన్ 2 పూర్తి చేసి, దేవర ఫినిషింగ్ లో ఉన్నాడు. ఎలాగూ ఈ రెండు వేసవిలోగా పూర్తవుతాయి కాబట్టి సమ్మర్ లో స్టార్ట్ అయ్యే చరణ్ మూవీకి పూర్తి అందుబాటులో ఉండొచ్చు.
ఆర్సి 16కి సుకుమార్ నిర్మాణ భాగస్వామిగానే కాకుండా బుచ్చిబాబు గురువుగా ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. ఈయన చెప్పడం వల్లే రత్నవేలు టీమ్ లోకి వచ్చారని అర్థం చేసుకోవచ్చు. ఉప్పెనకు శ్యామ్ దత్ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మార్పు పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ అప్డేట్స్ ఇవ్వకుండా తమ సహనాన్ని పరీక్షిస్తున్న టైంలో క్రమం తప్పకుండా ప్రకటనలు, ఆడిషన్లు, అనౌన్స్ మెంట్లు చేస్తున్న బుచ్చిబాబు టీమ్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యింది కానీ ఆ లాంఛనం మాత్రం కొంత ఆలస్యంగా బహిర్గతం చేస్తారు.
This post was last modified on February 24, 2024 11:59 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…