అఖిల్‍తో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అవడంతో అక్కినేని అభిమానులు ఆనందిస్తున్నారు. ఇన్నాళ్లకు అఖిల్‍కు ఒక మంచి ప్రాజెక్ట్ కుదిరిందని, సురేందర్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ చేతిలో అఖిల్ స్టార్ అవుతాడని ఫాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమయిన వార్త ప్రచారంలో వుంది. ఈ ప్రాజెక్ట్ అఖిల్‍కి సెట్ అవడంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించాడని దాని సారాంశం.
సురేందర్‍కి మంచి స్నేహితుడైన చరణ్ అతడికి అఖిల్‍తో ఒక సినిమా చేయాలని చెప్పాడట. అఖిల్‍ని సొంత తమ్ముడిలా భావించే చరణ్ అతని కెరియర్ పట్ల చాలా ఆసక్తి కనబరుస్తుంటాడనేది తెలిసిందే. సురేందర్ లాంటి స్టార్ డైరెక్టర్‍తో చేస్తే అఖిల్ ట్రాక్ మీదకు వచ్చేస్తాడని చరణ్ అతడిని స్వయంగా కోరినట్టు సమాచారం. అలాగే ఏకే ఎంటర్‍టైన్‍మెంట్స్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడంలోను చరణ్ పాత్ర వుందని అంటున్నారు.
చిరంజీవితో ఏకే ఎంటర్‍టైన్‍మెంట్స్ త్వరలో ఒక చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. దీని గురించి చరణ్, అఖిల్, సురేందర్, అనిల్ ఎక్కడా మాట్లాడలేదు కానీ ఈ వార్తలో నిజముంటే కనుక అక్కినేని ఫాన్స్ కి చరణ్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఏర్పడే ఛాన్స్ వుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates