ఎప్పుడో 90వ దశకంలో మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించిన ‘మణిచిత్రతాళు’ అనే సినిమా ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రభావం చూపింది. ఈ సినిమా కథతోనే కన్నడలో ‘ఆప్తమిత్ర’ తీస్తే అది బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత తమిళంలో రజినీకాంత్ హీరోగా ‘చంద్రముఖి’ పేరుతో రీమేక్ చేస్తే తమిళ, తెలుగు భాషల్లో రికార్డ్ బ్రేకింగ్ హిట్టయింది.
ఈ కథనే హిందీలోకి తీసుకెళ్లారు. ‘భూల్ భూలయియా’ పేరుతో వచ్చిన ఆ సినిమా కూడా సక్సెస్ అయింది. ‘భూల్ భూలయియా’లో అక్షయ్ కుమార్ హీరోగా నటించగా.. రెండేళ్ల కిందట కార్తీక్ ఆర్యన్ హీరోగా దీనికి సీక్వెల్ తీస్తే.. అది ఇంకా పెద్ద సక్సెస్ అయింది. కరోనా తర్వాత స్లంప్‌లో ఉన్న బాలీవుడ్‌కు గొప్ప ఉపశమనాన్ని అందించింది ఈ చిత్రం.
ఇప్పుడీ సినిమాకు ఇంకో సీక్వెల్ రాబోతోంది. ‘భూల్ భూలయియా-3’లోనూ కార్తీకే హీరో. ‘భూల్ భూలయియా’లో ప్రధాన పాత్ర చేసిన విద్యా బాలన్ ఈ ఫ్రాంఛైజీలోకి రీఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఇటీవలే ఆమ ఈ సినిమాలో భాగమైన విషయాన్ని వెల్లడించగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు ఇంకా క్రేజ్ పెంచిన అడిషన్ ఇది. ఇప్పుడు ఇంకో కొత్త అడిషన్‌తో ‘భూల్ భూలయియా-3’ ఇంకా క్రేజ్ పెంచుకుంది.
‘యానిమల్’ సినిమాలో తక్కువ నిడివి ఉన్న జోయా పాత్రతోనే బలమైన ఇంపాక్ట్ వేసింది త్రిప్తి డిమిరి. హీరోయిన్ రష్మికను మించి ఆమె క్రేజ్ తెచ్చుకుంది. ఆ పాత్రతో త్రిప్తికి బాగా డిమాండ్ ఏర్పడింది. ఆల్రెడీ ఆమె ‘ఆషికి-3’లో నటిస్తోంది. ఇప్పుడు ‘భూల్ భూలయియా-3’లోనూ భాగమైంది. ఆమె రాకతో ఈ సినిమాకు ఇంకా హైప్ వస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on February 21, 2024 5:03 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…