Movie News

ఓటిటిల దూకుడుకి అడ్డుకట్ట వేయగలరా

బాలీవుడ్ లో ఏదైనా కొత్త సినిమా థియేటర్ రిలీజ్, ఓటిటికి మధ్య ఖచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధనని చాలా కఠినంగా పాటిస్తున్నారు. లేదంటే తమ మల్టీప్లెక్సులను రిలీజ్ కు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేయడంతో ఉత్తరాది నిర్మాతలు దానికి అనుగుణంగానే అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఒకవేళ నెలలోపే స్ట్రీమ్టింగ్ అంటే మాత్రం సింగల్ స్క్రీన్లతో సర్దుకోవాల్సిందే. కానీ ఇలాంటి పద్ధతులు సౌత్ లో సాధ్యపడటం లేదు. సలార్, గుంటూరు కారం, నా సామిరంగ వగైరాలన్నీ కేవలం 28 రోజులకే వచ్చేసాయి. సైంధవ్ మరీ అన్యాయంగా మూడో వారంలోనే ప్రత్యక్షం.

ఇప్పుడీ ధోరణి మారాలనేది డిస్ట్రిబ్యూటర్ల వాదన. మన దగ్గర తక్కువే కానీ వీటి ప్రభావం తమిళనాడు, కేరళలో తీవ్రంగా ఉంది. అక్కడి థియేటర్లు సరైన సినిమాల ఫీడింగ్ లేక కనీస ఖర్చులు రాక ఇబ్బంది పడుతున్నాయి తెలుగులో హనుమాన్ లాంటివి హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా కంటెంట్ ని నమ్ముకుని కనక వర్షం కురిపించాయి. టాక్ తేడాగా ఊగినా గుంటూరు కారం వసూళ్లు అదిరిపోయాయి. కానీ కోలీవుడ్ లో అలాంటి పరిస్థితి లేదు. అందుకే హిందీలోలా ఇక్కడ కూడా సవరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదంత సులభంగా తేలే యవ్వారం మాత్రం కాదు.

ఎందుకంటే తెలుగు నిర్మాతలకు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పెట్టిన పెట్టుబడి రెవిన్యూ రూపంలో గరిష్టంగా రెండు మూడు వారాల్లోనే వచ్చేస్తోంది. మన ఆడియన్స్ ఆలోపే థియేటర్లలో చూస్తున్నారు. టికెట్ రేట్లకు భయపడో లేదా టాక్ విని వెనుకడుగు వేసిన వాళ్ళు ఓటిటి కోసమే ఎదురు చూస్తారు. పైగా నిర్మాణ సమయంలో ప్రొడ్యూసర్లకు ఆఫర్లు ఇస్తున్న ఓటిటిలు తక్కువ గ్యాప్ అయితేనే భారీ మొత్తాన్ని ఇస్తున్నాయి. లేదంటే సగం దాకా కోత ఉంటుందట. సో పద్మవ్యూహం లాంటి పరిస్థితిలో వీటిని కట్టడి చేయడం, నియంత్రించడం మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు.

This post was last modified on February 21, 2024 2:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

1 hour ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

1 hour ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

1 hour ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

2 hours ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

2 hours ago

అధికారులకు నచ్చని కలెక్టర్.. సీఎం ఒక్క ఛాన్స్ ఇస్తే?

పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…

2 hours ago