నాని సినిమా డౌటేనా?

టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తో నాని శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందే ఈ చిత్రానికి నాని మార్కెట్ కంటే బడ్జెట్ ఎక్కువ వేసుకున్నారనే టాక్ ఉంది. పీరియడ్ కథాంశం కావడంతో ఖర్చు బాగా పెట్టాలని నిర్మాతకి నాని చెప్పాడట.

జెర్సీ సినిమాతో ఈ బ్యానర్ లో నానికి మంచి వేల్యూ ఉంది. అందుకే అతని మాట కాదనలేక నాని మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చుకి కూడా సిద్ధపడ్డారు. డిసెంబర్ 25న రిలీజ్ అని కూడా ప్రకటించారు. కానీ లాక్ డౌన్ వల్ల ఈ చిత్రం డిసెంబర్ తర్వాత కానీ మొదలు కాదు.

మారిన పరిస్థితులు, లెక్కల దృష్ట్యా ఈ సినిమాకి బడ్జెట్ మళ్ళీ రీఅసెస్ చేసుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా నాని పారితోషికంతో పాటు టెక్నిషియన్స్ కి వేసుకున్న బడ్జెట్ కూడా మారనుంది. ఒకవేళ అందుకు నాని అంగీకరించని పక్షంలో రిస్క్ అధికం కనుక ఈ ప్రాజెక్ట్ డ్రాప్ అయినా ఆశ్చర్యం లేదని అనుకుంటున్నారు.

ఇంత వరకు ఒక్క రోజు షూటింగ్ కానీ, మ్యూజిక్ సిట్టింగ్స్ కానీ జరగకపోవడం వల్ల నిర్మాతకి ఈ చిత్రాన్ని ఎటు తీసుకెళ్లడానికి అయినా ఆస్కారం ఉంది.