హరిహర వీరమల్లు అనే సినిమా ఒకటి మేకింగ్ దశలో ఉన్న సంగతి కూడా కొన్ని రోజుల ముందు వరకు జనాలు మరిచిపోయారు. ఈ సినిమాను పవన్ పూర్తిగా పక్కన పెట్టేశాడని.. క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడని.. ఇలా రకరకాల ఊహగానాలు వినిపించాయి. దీంతో తీవ్ర అయోమయంలో పడిపోయిన పవన్ అభిమానులకు నిర్మాత ఏఎం రత్నం ఊరటనిచ్చాడు. ఈ సినిమా లైన్లోనే ఉందని.. విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే ఒక బ్లాస్టింగ్ అప్‌డేట్ ఉంటుందని నిర్మాణ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ అప్‌డేట్‌కు ముహూర్తం కుదిరినట్లు సమాచారం. మహాశివరాత్రి కానుకగా మార్చి 8న ‘హరిహర వీరమల్లు’ గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేయబోతున్నారట.
ఇంతకుముందు ‘వీరమల్లు’ నుంచి వచ్చిన ప్రోమోలన్నిటికంటే ఆసక్తికరంగా, గ్రాండ్‌గా ఈ గ్లింప్స్‌ను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రీకరించిన భారీ సన్నివేశాల్లోంచి బెస్ట్ షాట్స్ తీసి ఈ గ్లింప్స్ తీర్చిదిద్దుతున్నారట. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ వీడియోలో రిలీజ్ ప్రస్తావన కూడా ఉంటుందట. డేట్ చెప్పకుండా సీజన్ వరకు వెల్లడించనున్నారట.
ఈ ఏడాది అయితే ‘హరిహర వీరమల్లు’ విడుదల కావడానికి స్కోప్ లేదు. ఆ తర్వాత చూపు 2025 సంక్రాంతి మీద ఉంటుంది. కానీ ఆ సీజన్లో ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి భారీ చిత్రం ‘విశ్వంభర’ ఉంది. కాబట్టి దాన్ని కూడా విడిచిపెట్టి 2025 వేసవికి ‘వీరమల్లు’ను రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంది. బహుశా గ్లింప్స్‌లో 2025 సమ్మర్ రిలీజ్ అని ప్రకటించే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates