Movie News

తండేల్ రిస్క్ వెనుక ఎన్నో లెక్కలున్నాయ్

లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య – సాయిపల్లవి కాంబినేషన్ తో చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ ని దసరాకు విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలియడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే అదే పండగని టార్గెట్ చేసుకుని దేవర పార్ట్ 1 డేట్ ని అక్టోబర్ 10 ప్రకటించి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే చైతు మూవీని (ఇంకా అఫీషియల్ కాలేదు) రేసులోకి తేవడం ఆసక్తికరమైన పరిణామం. తారక్ ప్యాన్ ఇండియా మూవీతో తలపడటం అంత సులభం కాదు. పైగా తండేల్ కూడా సింగల్ లాంగ్వేజ్ కాదు. బహు భాషల్లో విడుదల చేస్తున్నారు. సో అన్ని మార్కెట్లలో క్లాష్ ఉంటుంది.

ఇంత రిస్క్ వెనుక నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాస్ కొన్ని పక్కా లెక్కలు వేసుకున్నట్టు కనిపిస్తోంది. డేట్ చెప్పడమైతే జరిగింది దేవర ఖచ్చితంగా అదే మాట మీద ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఏ చరిత్ర చూసినా ఏముంది స్టార్ హీరోల సినిమాలన్నీ వాయిదాల పర్వాలే అన్న తీరులో ఒకవేళ ఏదైనా అనూహ్య పరిణామ వల్ల ముందుకో వెనక్కో జరిగితే ఆటోమేటిక్ గా స్లాట్ ఖాళీ అవుతుంది. దాన్ని తండేల్ వాడుకోవచ్చు. పుష్ప 2 కనక ఆగస్ట్ నుంచి తప్పుకుంటే దేవర ఆ ప్లేస్ ని తీసుకుంటుందనే వార్తల నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ డిస్కషన్ జరుగుతోంది. కానీ సుకుమార్ టీమ్ కొట్టి పారేస్తోంది.

ఏ నిమిషంలో ఏదైనా జరగొచ్చు కాబట్టి తండేల్ ని సెప్టెంబర్ లోపే పూర్తి చేసుకుంటే ఏదైనా మంచి తేదీ దొరకడం ఆలస్యం విడుదల చేసుకోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. ఇలా ప్లానింగ్ మిస్ కావడం వల్లే టిల్లు స్క్వేర్, ది ఫ్యామిలీ స్టార్ లాంటివి ఇబ్బంది పడటం చూశాం. కానీ తండేల్ కి అలాంటి సమస్యలేం లేవు. ఇప్పుడు చిన్న బ్రేక్ ఇచ్చారు కానీ సాయిపల్లవి తిరిగి రాగానే షూట్ వేగమందుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ నుంచి పాటలు రాబట్టుకోవడంలో చందూ బిజీ ఉన్నాడు. ఇండియా పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సముద్రపు ప్రేమకథగా తండేల్ లో ఎమోషన్, యాక్షన్ రెండూ ఉంటాయట.

This post was last modified on February 18, 2024 7:34 am

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

3 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

4 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

4 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

5 hours ago