ఊరు పేరు భైరవకోన.. ఈ వారం తెలుగు ప్రేక్షకులను పలకరించిన చిత్రాల్లో విడుదలకు ముందే మంచి క్రేజ్ తెచ్చుకున్న మూవీ. నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్‌గా విడుదలకు రెండు రోజుల ముందే దీనికి పెయిడ్ ప్రిమియర్స్ వేశారు. ఐతే ఆ షోలన్నీ బాగానే నిండిపోయాయి కానీ.. వాటి నుంచి టాక్ అయితే ఆశించిన స్థాయిలో రాలేదు. షోలు అయ్యాక ఒక రకమైన నిశ్శబ్దం కనిపించింది సోషల్ మీడియాలో. సినిమా అంచనాలకు తగ్గట్లు లేదనే టాక్ రావడమే అందుక్కారణం.
ఇక శుక్రవారం సినిమా రిలీజయ్యాక కూడా కొంచెం సందడి కనిపించింది. రివ్యూలైతే మిక్స్డ్‌గానే వచ్చాయి. దీంతో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని అనుకున్నారు. మామూలుగా డివైడ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలకు మ్యాట్నీ నుంచి కలెక్షన్లు డల్ అయిపోతాయి. కానీ ‘ఊరు పేరు భైరవకోన’ విషయంలో మాత్రం అలా జరగలేదు. మ్యాట్నీలకు మంచి ఆక్యుపెన్సీనే కనిపించింది. ఇక ఈవెనింగ్, నైట్ షోలు అయితే చాలా చోట్ల ఫుల్ ఆక్యుపెన్సీలతో నడిచాయి. ప్రిమియర్స్ నుంచి వచ్చిన టాక్ తర్వాత తక్కువ అంచనాలతో సినిమా చూసిన వాళ్లకు ఇది నాట్ బ్యాడ్ అనిపిస్తోంది. ఒకసారి చూడ్డానికి ఓకే అనే టాక్ స్ప్రెడ్ కావడంతో.. థియేటర్లలో చూసే వాల్యూ ఉన్న మూవీ కావడంతో సాయంత్రం, నైట్ షోలు జనాలతో కళకళలాడాయి. ఆ ప్రభావం ఓపెనింగ్స్‌లోనూ స్పష్టంగా కనిపించింది.
నిర్మాతలు ప్రకటించినదాని ప్రకారం తొలి రోజు ‘ఊరు పేరు భైరవకోన’ ఆరు కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా స్థాయికి ఇది పెద్ద నంబరే. నిర్మాతలు నంబర్స్ కొంచెం పెంచి చూపించి ఉండొచ్చనుకున్నా గ్రాస్ ఐదు కోట్లకు అయితే తగ్గలేదని ట్రేడ్ వర్గాల సమాచారం. పెయిడ్ ప్రిమియర్స్‌తో డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం ఆశ్చర్యకరం. వీకెండ్ వరకు అయితే సినిమాకు ఢోకా లేదు. ఆ లోపు సినిమా సేఫ్ జోన్లోకి వచ్చేసేలాగే కనిపిస్తోంది.
This post was last modified on February 17, 2024 5:31 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…