Movie News

విశ్వక్ వదులుకుంటే దుల్కర్ అందుకున్నాడు

యువ నటుడు విశ్వక్ సేన్ ఎనర్జీ గురించి తెలిసిందే. వచ్చే నెల 8 గామిలో అఘోరాగా కొత్త అవతారంతో పలకరించబోతున్నాడు. ఆ తర్వాత తక్కువ గ్యాప్ తో గ్యాంగ్స్ అఫ్ గోదావరి కూడా వచ్చేస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవలే ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను చెప్పిన ఒక ముచ్చట అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే విశ్వక్ కు చాలా ఇష్టమైన హీరో సినిమాలో పెద్ద ఆఫర్ వస్తే చేయలేదు. వాల్తేరు వీరయ్యలో రవితేజ లాగా ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు బాగా నచ్చింది. అయినా ఒప్పుకోలేదట.

ఎందుకు అంటే అంతకన్నా మంచి క్యారెక్టర్ తన ఫేవరేట్ హీరోతో చేయాలనే ఉద్దేశంతోనని చెప్పాడు. నేరుగా పేరు చెప్పలేదు కానీ కొంచెం డీ కోడ్ చేసి చూస్తే మ్యాటర్ అర్థమైపోతుంది. విశ్వక్ సేన్ విపరీతంగా లైక్ చేసే హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్. ఎన్నో సందర్భాల్లో ఓపెన్ గా చెప్పాడు. దేవరలో తారక్ తప్ప మరో యూత్ హీరోకు స్కోప్ లేదని క్యాస్టింగ్ చూసి చెప్పొచ్చు. సో అది కాదు. ఇక బాలయ్య దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామాలో దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు. ఎంతో ప్రాముఖ్యం ఉంటే తప్ప ఈ మలయాళీ స్టార్ ఒప్పుకోడనే సంగతి ఓపెన్ సీక్రెట్.

సో విశ్వక్ మిస్ చేసుకున్నది దుల్కర్ పట్టేసుకున్నాడన్న మాట. ఎవరు ఏమనుకున్నా తనకు తోచిందే చేస్తానని చెప్పే విశ్వక్ సేన్ ఆ మధ్య డిసెంబర్ లో గ్యాంగ్స్ అఫ్ గోదావరి రిలీజ్ కాకపోతే దాని ప్రమోషన్లకు రానని చెప్పడం, ఆ తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుని మనసు మార్చుకోవడం చూశాం. అయినా సరే మార్చి 8 పెట్టుకున్న కొత్త డేట్ కూడా వాయిదా పడి గామికి ఇచ్చేయాల్సి రావడం ఊహించని పరిణామం. ఏది ఏమైనా బాలయ్య విశ్వక్ కలయికలో సీన్లు మంచి మాస్ గా ఉండేవి. బాబీ డైరెక్టర్ కాబట్టి కాంబో సన్నివేశాలను మంచి ఎలివేషన్లతో తీసేవాడు. మిస్ అయ్యింది.

This post was last modified on February 17, 2024 10:01 am

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

2 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

4 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

5 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

7 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

8 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

9 hours ago