ఆమె పెళ్ళికి అడ్డు పడిన సీనియర్ హీరోలు!

కాజల్ అగర్వాల్ కి ఆ మధ్య అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఇక పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంది. 34 ఏళ్ళు వచ్చేసాయి కనుక పెళ్లి వయసు దాటిపోతున్నట్టే. అందుకే ఇక చెల్లెలి పిల్లల్నిఆడించే పని మానుకుని తానే పెళ్లి చేసుకుందామని అనుకుంది.

కానీ అనూహ్యంగా మళ్ళీ తనకి అవకాశాలు పెరిగాయి. కమల్ ఇండియన్ 2లో ఆమె ఎప్పుడో బుక్ అయింది. త్రిష ఆచార్య నుంచి తప్పుకోవడంతో ఆ అవకాశం కాజల్ ని వరించింది. వెంకటేష్ కొత్త సినిమాలో కూడా కాజల్ కే అవకాశం దక్కింది. దీంతో కాజల్ తన పెళ్లిని మరో రెండేళ్లు తర్వాతకి వాయిదా వేసుకుంది.

అసలు అవకాశాలే రాని టైంలో సినిమాకి కోటి పారితోషికం ఎందుకు వదులుకోవాలి. పెళ్ళిదేముంది… రెండేళ్ల తర్వాత కూడా ఎవరో ఒక వరుడు దొరుకుతాడు కానీ డబ్బు ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ రాదుగా? సీనియర్ హీరోలకి హీరోయిన్ల కొరత బాగా ఉంది కాబట్టి కాజల్ ఇప్పుడు వారి సినిమాలకి మెయిన్ ఆప్షన్ గా మారింది.