పెళ్లి కాని యువతీ యువకులకు ఫిబ్రవరి 14 అంటే ఒక స్పెషల్ ఎమోషన్. వాలెంటైన్ డేగా ప్రపంచం మొత్తం ఎంత సంబరంగా జరుపుకుంటుందో, ఎంత ఆనందంగా లవ్ జంటలు రోజంతా గడుపుతాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. కేవలం పార్కులకు, రెస్టారెంట్లకే కాదు థియేటర్లకు వచ్చేలా పాత సినిమాల వర్షం కురిపించబోతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. సిద్దార్థ్ – షామిలి జంటగా నటించిన ‘ఓయ్’ని ఆ రోజు రీ రిలీజ్ చేస్తున్నారు. ఫ్లాప్ అయినా సరే దీనికి ప్రత్యేక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువన్ శంకర్ రాజా సంగీతంలో వచ్చిన పాటలు యూత్ కి ఓ రేంజ్ లో ఎక్కేశాయి.
కొన్ని నెలల క్రితం వచ్చి హౌస్ ఫుల్ కలెక్షన్స్ ఇచ్చిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ని ఇంకోసారి తెరమీదకు తెస్తున్నారు. గౌతమ్ మీనన్ మాయాజాలంలో తడిసేందుకే ఫ్యాన్స్ కూడా రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ హైదరాబాద్ బుకింగ్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది బ్లాక్ బస్టర్ ‘సీతారామం’ని ప్రత్యేక ప్రీమియర్లకు రెడీ చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై. మొహబ్బతే లాంటి క్లాసిక్స్ ని యష్ రాజ్ ఫిలింస్ అందిస్తోంది. నేనేం తక్కువా అంటూ ఎవర్ గ్రీన్ ‘టైటానిక్’ కూడా జనాలను పలకరించబోతోంది.
కొత్త సినిమాలే నాలుగైదు రిలీజవుతున్న వారంలో ఒకేసారి ఇన్ని ఓల్డ్ క్లాసిక్స్ మూకుమ్మడిగా దాడి చేయడం విచిత్రం. కొత్త తమిళ డబ్బింగ్ ట్రూ లవర్ సైతం కేవలం లవర్స్ డే సెంటిమెంట్ ని నమ్ముకునే బరిలో దిగుతోంది. సో ఒకటి రెండు కాదు బోలెడు ఆప్షన్లు ప్రేమికుల కోసం రెడీ అవుతున్నాయి. కాకపోతే ఏకాంతంగా సమయం గడపాలంటే మాత్రం వీటిలో తక్కువ బుకింగ్స్ జరిగే వాటిని లవర్స్ ఎంచుకుంటారని వేరే చెప్పాలా. ఒక్క ఫిబ్రవరి 14న కానుకల రూపంలో ఇచ్చేందుకు జరిగే బిజినెస్ కొన్ని వందల కోట్లలో ఉంటుంది. గిఫ్ట్ షాపులు కిటకిటలాడుతాయి. ఈసారి వీటికి థియేటర్లు తోడవుతాయి.
This post was last modified on February 8, 2024 7:57 pm
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…