Movie News

వి క‌థ ముగిసింది.. వాట్ నెక్స్ట్

ఎన్నో ఆశ‌లు, అంచ‌నాలు.. వాట‌న్నింటినీ నీరుగార్చేసింది వి సినిమా. ఇదేమీ చెత్త సినిమా కాదు కానీ.. కాంబినేష‌న్ క్రేజ్, ప్రోమోల ఆధారంగా పెట్టుకున్న అంచ‌నాల‌కు మాత్రం చాలా దూరంలో నిలిచిపోయింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చి ఉంటే.. కొన్ని వారాల పాటు చ‌ర్చ‌ల్లో ఉండేది. కానీ టాక్ భిన్నంగా ఉండ‌టంతో చ‌ర్చ కూడా నెమ్మ‌దించింది.

ఇక అంద‌రి దృష్టీ ఓటీటీలో రిలీజ‌య్యే త‌ర్వాతి పేరున్న తెలుగు సినిమా ఏది అనే విష‌యం మీదికి మ‌ళ్లింది. త‌ర్వాత ఏ సినిమా వ‌చ్చినా.. దానిపై వి తాలూకు ఎఫెక్ట్ క‌చ్చితంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇంత‌కీ ఆ సినిమా ఏది అన్నది ఇప్పుడు ప్ర‌శ్న‌.

మార్చి నెలాఖ‌ర్లో వి విడుద‌ల కాగానే దాని వెనుకే ఉప్పెన‌, రెడ్ సినిమాలు రావాల్సింది. వాటికి అప్పుడే ఫ‌స్ట్ కాపీలు రెడీ అయిపోయాయి. అయితే ఉప్పెన మెగాస్టార్ చిన్న మేన‌ల్లుడి అరంగేట్ర సినిమా కాబ‌ట్టి ఓటీటీ రిలీజ్ వ‌ద్ద‌నుకుంటున్నారు.

రామ్ రెడ్ సినిమాకు ఆల్రెడీ వేరే మార్గాల్లో పెట్టుబ‌డి వెన‌క్కి రావ‌డంతో ఓటీటీ రిలీజ్ విష‌యంలో వెనుకంజ వేస్తున్నార‌ట‌. కాగా నిశ్శ‌బ్దం, సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమాలు ఓటీటీ విడుద‌ల‌కు సుముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌కు సంబంధించి ఇంకా కొంత వ‌ర్క్ మిగిలుంద‌ట‌.

నిశ్శ‌బ్దం ప‌ని మాత్రం పూర్త‌యిన‌ట్లు, ఫ‌స్ట్ కాపీ రెడీ అయిన‌ట్లు స‌మాచారం. ఈ మ‌ధ్య ఇచ్చిన సంకేతాల ప్ర‌కారం ఓటీటీ రిలీజ్‌కు ఆల్మోస్ట్ రెడీ అయిన‌ట్లే. ఓటీటీ రిలీజ్‌ల విష‌యంలో వి తాలూకు నెగెటివిటీ కొంచెం త‌గ్గే వ‌ర‌కు చూసి ఈ నెలాఖ‌ర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు.

ఇంకా కీర్తి సురేష్ సినిమాలు మిస్ ఇండియా, గుడ్ ల‌క్ స‌ఖి కూడా ఓటీటీ రిలీజ్‌కు సై అంటున్నాయి కానీ.. వాటి డీల్స్ తెగ‌లేద‌ని, కొంత ప‌ని కూడా మిగిలుంద‌ని అవి ఆల‌స్యం కావ‌చ్చ‌ని చెబుతున్నారు.

This post was last modified on September 8, 2020 11:50 am

Share
Show comments
Published by
Satya
Tags: OTTVV MOvie

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

2 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

8 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

9 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

10 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

13 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

13 hours ago