మొన్నటి దాకా సాధారణ మహిళగా రోడ్డు సైడ్ తక్కువ ధరకు భోజనాలు అమ్ముతూ జీవితం గడిపిన కుమారి ఆంటీ సెలబ్రిటీగా మారిపోయింది. ఏకంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్ స్టాల్ ని సందర్శిస్తారని టాక్ వచ్చిందో అప్పటి నుంచి మీడియా తాకిడి మరింతగా పెరిగింది. రోజు వందలాది కెమెరాలు ఆమెను నీడలా వెంటాడుతున్నాయి. ఈ గోల తట్టుకోలేక పక్కన ఇదే బిజినెస్ చేస్తున్న ఇతర స్త్రీలు తాము పడుతున్న అగచాట్లను చెప్పుకుంటున్న వైనం వీడియోల రూపంలో చక్కర్లు కొడుతోంది. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు స్టోరీ మొదలుకానుంది.
డిజిటల్ వర్గాల కథనం ప్రకారం నెట్ ఫ్లిక్స్ ఈ కుమారి ఆంటీ మీద మూడు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ తీసే ఆలోచనలో ఉందట. ఫేమ్ పేరుతో ఆవిడ బాల్యం నుంచి మొదలుపెట్టి, ఏపీ వదిలేసి హైదరాబాద్ కు వచ్చేందుకు దారి తీసిన పరిస్థితుల వరకు, అవమానాలు, ఎదుగుదల అన్నీ ఇందులో చూపిస్తారట. ఇది కార్యరూపం దాల్చాలంటే ఆమె అనుమతి తప్పనిసరి. ఒప్పుకుంటే మాత్రం కళ్ళు చెదిరే మొత్తం నెట్ ఫ్లిక్స్ నుంచి రెమ్యునరేషన్ గా అందుతుంది. మాములుగా క్రైమ్ స్టోరీస్ మీద ఎక్కువ డాక్యు సిరీస్ లు తీసే ఈ ఓటిటి కళ్ళు కుమారి ఆంటీ మీద పడటం విశేషమే.
దీనికి సంబంధించిన అధికారిక నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది కాబట్టి ఖరారుగా చెప్పలేం. ఇప్పటికే బిబిసి ప్రతినిధులు కలిసి వెళ్లినట్టు సమాచారం. ఒక ముఖ్యమంత్రినే నీ హోటల్ కు వస్తాను అని చెప్పే దాకా వ్యవహారం వెళ్లిందంటే కుమారి ఆంటీ హోటల్ మాములు వైరల్ కాలేదు. రెండు లివర్స్ ఎక్స్ ట్రా వెయ్యి రూపాయలంటూ ఒక మీమర్ సరదాగా చేసిన వీడియో ఇక్కడిదాకా తీసుకొచ్చిందంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇదే నిజం. ఈ హడావుడి వల్ల జనాల తాకిడి విపరీతంగా పెరిగింది కానీ బిజినెస్ ఇంకా ఆ స్థాయిలో లేదంట. తినడానికి వచ్చినవాళ్ళ కంటే ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్న వాళ్లే ఎక్కువ.
This post was last modified on February 5, 2024 4:43 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…