Movie News

2025 సంక్రాంతి.. హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టాల్సిందే

2025 సంక్రాంతికి ఇంకా ఏడాది సమయం ఉంది. మామూలుగా ఈ పండుగ సీజన్‌కు ఉండే క్రేజ్ దృష్ట్యా ఐదారు నెలల ముందే బెర్తులు బుక్ అవుతుంటాయి. కానీ ఈసారి విడ్డూరంగా మరీ ఏడాది ముందే సంక్రాంతి సినిమాల విడుదలను ఖరారు చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘విశ్వంభర’కు అయితే జనవరి 10 అంటూ డేట్ కూడా ప్రకటించేశారు. మరోవైపు దిల్ రాజు ‘శతమానం భవతి’ సీక్వెల్‌తో వచ్చే సంక్రాంతికి రానున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ సినిమాలో నటీనటులెవరో.. ‘శతమానం భవతి’ తీసిన సతీశ్ వేగేశ్ననే డైరెక్ట్ చేస్తాడా ఇంకెవరైనా ఆ సినిమా చేస్తారా.. ఈ వివరాలేవీ తెలియవు. కానీ సంక్రాంతికి ఆ సినిమా అన్నది మాత్రం ఖరారైంది.

ఇంకోవైపు అక్కినేని నాగార్జున ‘నా సామిరంగ’ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. వచ్చే సంక్రాంతికి మళ్లీ కలుద్దాం అని పేర్కొనడం ద్వారా మళ్లీ తాను పండుగ బరిలో ఉంటానని చెప్పేశారు. ఆయన ఏ సినిమాతో సంక్రాంతికి వస్తాడన్న క్లారిటీ కూడా లేదు. దీన్ని బట్టి సంక్రాంతి కోసం ఎంత తొందరపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇంకో పెద్ద సినిమా సంక్రాంతి రిలీజ్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రభాస్-మారుతి కలయికలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ను 2025 సంక్రాంతికి తేవాలని చూస్తున్నారట. ముందు దసరా టైంకే అనుకున్నా అప్పటికి సినిమా రెడీ అయ్యేలా లేదట. సంక్రాంతి అయితేనే అన్ని రకాలుగా మంచిదన్న ఉద్దేశంతో ఆ డేట్ మీద దృష్టిసారించినట్లు సమాచారం.

మరోవైపు బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా.. వెంకటేష్-అనిల్ రావిపూడి కలయికలో మొదలు కానున్న చిత్రం కూడా సంక్రాంతిని టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే 2025 సంక్రాంతికి చాలా ముందుగానే హౌస్ ఫుల్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

This post was last modified on February 4, 2024 4:41 pm

Share

Recent Posts

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

1 hour ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

2 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

2 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

2 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

4 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

5 hours ago