ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ ఎప్పుడు విడుదలవుతుందో ఇంకా క్లారిటీ లేదు. ఈగల్ ప్రమోషన్ల సందర్భంగా మీడియాతో మాట్లాడిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వప్రసాద్ దీనికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదని, సంక్రాంతికి రావాలనుకుంటే ప్రభాస్ కు ఒక స్లాట్ సిద్ధంగా ఉంటుందని, ముందే రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశారు. ఈ ఫిబ్రవరిలోనే అప్డేట్ ఇస్తామని కూడా అన్నారు. అది పాట గురించా లేక రిలీజ్ డేట్ గురించా అనే క్లారిటీ ఇవ్వలేదు.
నిజానికి సలార్ లాగే రాజా సాబ్ డిసెంబర్ లో వస్తుందనే టాక్ ఇప్పటిదాకా ఉంది. ఇప్పుడు జనవరికి షిఫ్ట్ కావడమంటే ఆసక్తికరమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే విశ్వంభరని ఆల్రెడీ అఫీషియల్ గా లాక్ చేశారు. యువి బ్యానర్ అంటే అది ప్రభాస్ కి స్వంత సంస్థ అన్నంత ప్రాధాన్యం ఇస్తాడు. అలాంటిది వాళ్ళ ప్యాన్ ఇండియా మూవీకి తనది ఎదురు నిలపమని చెబుతాడని అనుకోలేం. అయితే ఒకే పండక్కు ఒకే బ్యానర్ తీసిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలు ఒక రోజు గ్యాప్ తో రిలీజై బ్లాక్ బస్టరయ్యాయనే లాజిక్ కనక ఉపయోగిస్తే ఇదో పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు.
ఇంకా సంవత్సరం టైం ఉన్నా సంక్రాంతి గురించి నిర్మాతలు హడావిడి పడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. నాగార్జున అసలు ఏ సినిమానో చెప్పకుండా పండక్కు మళ్ళీ కలుద్దాం అనేశారు. దిల్ రాజు తన సినిమా ఒకటి ఉంటుందని చెప్పేశారు. అది వెంకటేష్ దా లేకా శతమానం భవతి 2నా అనే క్లారిటీ లేదు. బాలయ్య బాబీలది లేట్ అయితే అదీ ఈ రేసులోనే ఉంటుంది. కానీ ది రాజా సాబ్ కేసు వేరు. ప్యాన్ ఇండియాలో క్రేజ్ వస్తుంది కాబట్టి బరిలో ఉంటే దాన్ని ఫేస్ చేయడం అంత సులభంగా ఉండదు. హారర్ టచ్ ఉన్న ఎంటర్ టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో వింటేజ్ ప్రభాస్ ని చూడొచ్చని టాక్.