రవితేజ లాంటి స్టార్ హీరో సినిమా అంటే టెక్నీషియన్లు అందరూ పేరున్న వాళ్లనే పెట్టుకుంటారు సాధారణంగా. కనీసం ఒక్క పేరున్న సినిమా అయినా చేసిన అనుభవం ఉన్న టెక్నీషియన్లనే ఎంచుకుంటారు. ఐతే మాస్ రాజా కొత్త సినిమా ‘ఈగల్’ పోస్టర్ మీద మాత్రం సంగీత దర్శకుడిగా డేవ్ జాంద్ అనే పేరు చూసి అందరూ షాకయ్యారు. ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని పేరిది. అతను ఎవరో ఏంటో.. తన నేపథ్యం ఏంటో తెలియదు.
నేరుగా ‘ఈగల్’ లాంటి పెద్ద సినిమాలోకి వచ్చేశాడు. ‘ఈగల్’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మీడియాను కలిశాడు డేవ్ జాంద్. ఇంతకీ తన నేపథ్యమేంటో.. అతను ‘ఈగల్’లో ఎలా భాగం అయ్యాడో తన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘నేను పదో తరగతి నుంచే పియానో, డ్రమ్స్, గిటార్ ప్రోగ్రామింగ్ చేసేవాడిని. సొంతంగానే సంగీతం నేర్చుకున్నా. ఫ్రీలాన్స్ మ్యుజీషియన్‌గా పని చేయడం మొదలుపెట్టా. సోనీ ఇంటర్నేషనల్ గేమ్స్‌కి, ఇంకొన్ని భారతీయ షోలకు సంగీతం అందించా. హీరో శ్రీ విష్ణు, నేను కలిసి చదువుకున్నాం. తన వల్లే సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని పరిచయం అయ్యాడు. అతను రాసుకున్న స్క్రిప్టులకు తగ్గట్లుగా ముందే సంగీతం సమకూర్చేవాడిని. తనతో ట్రావెల్ అవుతుండగానే రవితేజ గారితో ‘ఈగల్’ ఖరారైంది. రవితేజగారి సినిమా అంటే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అందుబాటులో ఉంటారు.
కానీ నేను ఈ కథ కోసం రెడీ చేసిన మూడు ట్రాక్స్ కార్తీక్‌కు నచ్చడం, అవి రవితేజ గారు విని ఓకే చేయడంతో నన్నే సంగీత దర్శకుడిగా ఖాయం చేశారు. ఈ సినిమాలో అన్ని రకాల పాటలు ఉన్నాయి. అవి కొత్తగా ఉంటాయి. కార్తీక్‌తోనే ఇంకో సినిమా కూడా చేస్తున్నా. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రానున్న కొత్త చిత్రానికి కూడా నేనే సంగీత దర్శకుడిని’’ అని డేవ్ జాంద్ తెలిపాడు.
This post was last modified on February 2, 2024 5:36 pm
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…