స్టార్ హీరోల సినిమాలకు హీరోయిన్ల కొరత ఏర్పడి కథానాయికను ఫిక్స్ చేయకుండానే షూటింగ్‌కు వెళ్లపోతున్నాయి కొన్ని చిత్ర బృందాలు. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న ‘రాబిన్ హుడ్’ ఈ కోవకే చెందుతుంది. మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘విశ్వంభర’ త్వరలోనే మొదలవుతుండగా ఇంకా కథానాయిక ఖరారు కాలేదు.
అలాగే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబినేషన్లో మొదలైన సినిమాకు కూడా హీరోయిన్ ఫిక్స్ చేయకుండానే షూటింగ్‌కు వెళ్లిపోయారు. రెండు షెడ్యూళ్ల చిత్రీకరణ కూడా పూర్తయింది. ఐతే షూటింగ్ మధ్య దశకు చేరుకున్న ఈ చిత్రానికి ఎట్టకేలకు హీరోయిన్ ఓకే అయింది. కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్‌ను బాలయ్యకు జోడీగా ఎంపిక చేసినట్లు తాజా సమాచారం.
నాని ‘జెర్సీ’, సిద్ధు జొన్నలగడ్డ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించిన శ్రద్ధ.. ఇటీవలే ‘సైంధవ్’ చిత్రంతో పలకరించింది. ఆ సినిమా, అందులో శ్రద్ధ పాత్ర పెద్దగా ఇంపాక్ట్ వేయలేకపోయాయి. ఐతే సీనియర్ హీరో పక్కన శ్రద్ధ బాగానే సూటైంది అనిపించింది. దీంతో బాలయ్యకు జోడీగా ఆమెను ఎంపిక చేశారు.
బాలయ్య పక్కన కూడా ఆమె బాగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో బాలయ్య నెవర్ బిఫోర్ రోల్‌లో కనిపించబోతున్నాడు. సినిమా ఫుల్ మాస్‌గా, వయొలెంట్‌గా ఉంటుందని ప్రి లుక్ పోస్టర్ చూస్తే అర్థమైంది. ఇలాంటి సినిమాల్లో హీరోయిన్‌కు అంత ప్రాధాన్యం ఉండకపోవచ్చు. కానీ పెద్ద సినిమా కాబట్టి పారితోషకం బాగానే ఉంటుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. బహుశా దసరాను టార్గెట్‌గా పెట్టుకుని ఉండొచ్చు.
This post was last modified on January 31, 2024 9:39 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…