గత ఏడాది విరూపాక్షతో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా గాంజా శంకర్ ప్రకటించి నెలలు దాటేసింది. సంపత్ నంది దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకుంది. ఎప్పుడో అక్టోబర్ లో చిన్న కాన్సెప్ట్ టీజర్ వదిలారు కానీ ఆ తర్వాత చడీ చప్పుడు లేదు. మాములుగా నిర్మాత నాగవంశీ దీని గురించి ఎక్కడో ఒక చోట ప్రస్తావన తెచ్చేవారు కానీ మ్యాడ్ నుంచి గుంటూరు కారం దాకా ఏ ఇంటర్వ్యూలోనూ ఈ టాపిక్ రాలేదు. హీరోయిన్ గా పూజా హెగ్డేననే టాక్ వచ్చినా దాని నిర్ధారణ కూడా జరగలేదు. అయితే తెరవెనుక అనఫీషియల్ కథ వేరే వినిపిస్తోంది.
దాని ప్రకారం గాంజా శంకర్ ప్రస్తుతం హోల్డ్ లో ఉంది. దానికి కారణం బడ్జెట్ ఇష్యూసట. ముందు వేసుకున్న లెక్కల ప్రకారం ఓటిటి నుంచి భారీ ఆఫర్లు రాలేదట.కేవలం థియేట్రికల్ రైట్స్ తో అంత రికవరీ కావడం కష్టమని గుర్తించి కాస్ట్ కటింగ్ కు ఏమేం చేయాలో ఆలోచించే పనిలో దర్శన నిర్మాతలున్నట్టు వినికిడి. విరూపాక్షతో సాయి ధరమ్ తేజ్ తిరిగి సక్సెస్ ట్రాక్ లో పడినా ఒక్కసారిగా తన మార్కెట్ అమాంతం పెరిగిపోలేదు. పైగా అది కేవలం తన ఇమేజ్ మీద ఆడిన సినిమా కాదు. హారర్ ఎలిమెంట్స్ తో దర్శకుడు కార్తీక్ దండు పనితనం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.
నిర్మాణంలో ఉన్నా సరే ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండే సితార టీమ్ ఒక్క గాంజా శంకర్ విషయంలోనే సైలెంట్ గా ఉండటం వల్ల ఈ డౌట్లు రావడం సహజం. ఎప్పుడూ లేనంత ఊర మాస్ గా సాయి ధరమ్ తేజ్ ని చూపించేందుకు సంపత్ నంది పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. గతంలో సీటిమార్ కు సైతం బడ్జెట్ సమస్యలు ఫేస్ చేసిన ఈ మాస్ దర్శకుడు ఈసారి కూడా అడ్డంకిని ఎలా దాటతాడో చూడాలి. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న గాంజా శంకర్ కు సంబందించిన ఇతర డీటెయిల్స్ వీలైనంత త్వరగా ఫ్యాన్స్ కి అందిస్తే నిజమో కాదో తెలియని పుకార్లకు చెక్ పెట్టేయొచ్చు.
This post was last modified on January 30, 2024 2:24 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…