దేవుడిని ఆధారంగా చేసుకుని తెలుగులో కొన్ని వేల సినిమాలు వచ్చాయి కానీ థియేటర్లో వాటిని చూస్తున్నప్పుడు వచ్చే ఉద్వేగాలు అన్నింటికీ ఒకేలా ఉండవు. తాజాగా హనుమాన్ ప్రదర్శిస్తున్న థియేటర్లో ఒక మహిళా చిత్రంలో పూర్తిగా లీనమైపోయి భగవంతుడి స్తోత్రం వచ్చినప్పుడు పూనకంతో ఊగిపోవడం చూసి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కలవాళ్ళు విస్తుపోయి చూశారు. ఇదెక్కడో పల్లెటూళ్ళో అనుకుంటారేమో. కాదు. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలోని ఒక మల్టీప్లెక్సులో తెరకు కాస్త దగ్గరగా ఉన్న ఫ్యామిలీ మూవీ చూస్తుండగా జరిగిన సంఘటన ఇది. వీడియో వైరలవుతోంది.
ఇలాంటి ఘటనలు చాలా అరుదు. 1995లో అమ్మోరు రిలీజైనప్పుడు ఇదే తరహాలో స్త్రీలు పూనకాలు వచ్చి కూర్చున్న సీట్లలో శివాలెత్తిపోవడం అప్పటి పత్రికల్లో వచ్చింది. సెల్ ఫోన్లు లేని కాలం కాబట్టి వీడియో సాక్ష్యం లేదు కానీ మ్యాగజైన్స్ చదివిన వాళ్లకు ఇది బాగా గుర్తు. రమ్యకృష్ణ టైటిల్ పాత్ర పోషించిన అమ్మోరులో సౌందర్య నటన, గ్రాఫిక్స్ ని వాడి దర్శకుడు కోడి రామకృష్ణ తెరమీద గ్రామ దేవత మహత్యాన్ని చూపించిన తీరు బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది. ఆరేళ్ళు నిర్మాణంలో ఉండి ఆలస్యంగా రిలీజై సంచలన రికార్డులు నమోదు చేయడం మర్చిపోలేని చరిత్ర.
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత హనుమాన్ కు ఆ ప్రభంజనం కనిపిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ టాప్ సంక్రాంతి గ్రాసర్ గా నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్న హనుమాన్ జోరు తగ్గించలేదు. వీక్ డేస్ లో నెమ్మదించినా సెలవులు, వారాంతాలు వచ్చినప్పుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. కొన్ని చిన్న సెంటర్లలో స్టార్ హీరోలకు మాహా కష్టంగా అనిపించే కోటి రూపాయల గ్రాస్ ని హనుమాన్ చాలా తేలికగా దాటేయడం చూసి ట్రేడ్ కి నోట మాట రావడం లేదు. ఓవర్సీస్ లో అయిదు మిలియన్లు దాటేసి ప్రస్తుతం సలార్ స్థానం మీద కన్నేసిన హనుమాన్ ఫుల్ రన్ లోపు దాన్ని తేలికగా దాటేలా ఉంది.
This post was last modified on January 30, 2024 3:46 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…