ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి మే 9 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా వార్తలు హోరెత్తిపోతున్న టైంలో ఇది కూడా అదే దారి పడుతుందేమోననే అనుమానాలు బలంగానే ఉన్నాయి. అయితే వైజయంతి టీమ్ మాత్రం అలాంటిదేమి లేదని అంటోంది. ఖచ్చితంగా చెప్పిన డేట్ కి వస్తామని, ఎలాంటి ఒత్తిడి లేదని క్లారిటీ ఇస్తోంది. సో ఇంకో మూడున్నర నెలల్లో ఇండియన్ స్క్రీన్ మీద డార్లింగ్ ఇవ్వబోతున్న అతి పెద్ద విజువల్ ట్రీట్ కి ఫ్యాన్స్ రెడీ అయిపోవచ్చు. ఇక అసలు పాయింట్ కి వద్దాం.
ఇందులో ప్రత్యేక క్యామియోల్లో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలు ఉంటారని ఇప్పటిదాకా ఉన్న అనధికార లీక్. అఫీషియల్ గా చెప్పలేదు కానీ బలమైన సోర్స్ నుంచే బయటికి వచ్చింది. తాజాగా తెలిసిన ట్విస్టు ఏంటంటే అతిథి పాత్రల లిస్టు ఆగదట. క్లైమాక్స్ కు ముందు వచ్చే కీలక ఘట్టంలో కృపాచార్యగా న్యాచురల్ స్టార్ నాని కనిపిస్తాడని అంటున్నారు. అంతే కాదు పరశురాముడిగా కొన్ని నిముషాలు తెరను ఊపేసే క్యారెక్టర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ని సంప్రదించినట్టు తెలిసింది. అయితే ఈ రెండు ఖరారుగా ఔనా కాదనేది ఇప్పుడే చెప్పలేం. కొంత వేచి చూడక తప్పదు.
చూస్తుంటే నాగ అశ్విన్ అంచనాలకు మించి ఏదో చేయబోతున్నాడని అర్థమవుతోంది. ప్రస్తుతానికి రెండు భాగాలుగా రూపొందుతున్న కల్కి 2898 ఏడి ఆరు వందల సంవత్సరాల క్రితం బ్యాక్ డ్రాప్ తో మొదలై భవిష్యత్తుకు చేరుకుంటుంది పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒకవైపు జరుపుతూనే ఇంకోవైపు బ్యాలన్స్ షూటింగ్ ని వేగంగా పూర్తి చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న కల్కిలో దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, అనుపమ్ ఖేర్ తదితర బాలీవుడ్ క్యాస్టింగ్ తో తో పాటు తెలుగు తమిళ రంగానికి చెందిన ఎందరో నటీనటులు ఇందులో భాగం పంచుకున్నారు.
This post was last modified on January 29, 2024 11:30 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…