Movie News

రాక్షస రాజులో సంచలన రాజకీయాలు

దర్శకుడు తేజ హీరో రానా కాంబోలో తెరకెక్కుతున్న రాక్షస రాజులో చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని యూనిట్ టాక్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వేదికగా గత మూడు తరాల్లో జరిగిన విపరీత రాజకీయాలను ఇందులో చూపించబోతున్నట్టు తెలిసింది. తోడల్లుళ్ల పాలిటిక్స్, పవర్ కోసం హత్యలు చేయించే క్రూర మనస్తత్వాలు, ఒకే కుటుంబంలో భిన్న ధృవాల్లాంటి వ్యక్తుల మధ్య ఎలుక పిల్లి చెలగాటాలు ఇలా ఎన్నో అంశాలు స్పృశించబోతున్నారట. నేనే రాజు నేనే మంత్రి దీని ముందు నథింగ్ అనిపించే రేంజ్ లో తేజ పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని ఇన్ సైడ్ టాక్.

లేకపోతే సీత, అహింస లాంటి డిజాస్టర్ల తర్వాత నమ్మి ఇంకో అవకాశం రావడమంటే మాటలు కాదు. అది కూడా చాలా క్యాలికులేటెడ్ గా ఉండే సురేష్ బాబు నుంచి. రాక్షస రాజు అన్ని భాషల్లో సంచలనం సృష్టించే కంటెంట్ కావడం వల్లే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. దీన్ని కేవలం ఒక వర్షన్ కే పరిమితం చేయకుండా ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తారట. రానాకు సై అంటే సై అనే మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం ఎవరైనా సీనియర్ స్టార్ హీరో అయితే బాగుంటుందని తేజ రెండు మూడు ఆప్షన్లు పెట్టుకుని ట్రై చేస్తున్నారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఈ లిస్టులో ఉన్నారట.

బాహుబలి, నేనే రాజు నేనే మంత్రి, భీమ్లా నాయక్ తప్ప రానా కెరీర్ లో గత కొన్నేళ్లలో చెప్పుకోదగ్గ సినిమా లేదు. అనారోగ్యం వల్ల కొంత బ్రేక్ వచ్చినా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ వ్యవహారాలన్నీ తనే చూసుకోవాల్సి రావడంతో నటన మీద అంతగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. డిస్ట్రిబ్యూషన్ లో సురేష్ బాబు యాక్టివ్ గా ఉన్నట్టు కనిపిస్తున్నా వాటికి సంబంధించిన కీలక నిర్ణయాలు రానానే తీసుకుంటున్నట్టు టాక్. రాక్షస రాజుతో ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయిన రానా బడ్జెట్ ఎంతైనా ఖర్చు పెట్టమని తేజకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారట. ఆయనది వాడుకోవడమే ఆలస్యం.

This post was last modified on January 25, 2024 7:53 pm

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

23 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

2 hours ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

6 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago