రాహుల్ యాదవ్ నక్క.. వైవిధ్యమైన చిత్రాలతో తన అభిరుచిని చాటుకున్న నిర్మాత. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బేనర్ మీద అతను తీసిన తొలి చిత్రం ‘మళ్ళీ రావా’ ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దీని తర్వాత రాహుల్ నిర్మించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మరోసారి అతడి అభిరుచిని చాటింది. ఈ సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి ఎంత మంచి స్థాయికి వెళ్లాడో తెలిసిందే.
రాహుల్ నుంచి వచ్చిన మూడో సినిమా.. మసూద. దీంతోనూ సాయికిరణ్ అనే ప్రతిభావంతుడైన కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. చాలా వరకు కొత్త వాళ్లను పెట్టి ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు తీసి హిట్లు కొట్టడం అంటే చిన్న విషయం కాదు. ఈ విషయంలో రాహుల్ అభిరుచిని, గట్స్‌ను అభినందించాల్సిందే.
సినిమాకు సినిమాకు గ్యాప్ తీసుకుని.. ప్రతిసారీ ఒక కొత్త టీంను పరిచయం చేస్తున్న రాహుల్.. మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి అతను ‘బ్రహ్మ ఆనందం’ అనే మరో వెరైటీ సినిమా చేయబోతున్నాడు. ఈసారి అతను పరిచయం చేయబోతున్న కొత్త దర్శకుడి పేరు.. ఆర్వీఎస్ నిఖిల్. అతను చెప్పిన కామెడీ-ఎమోషనల్ డ్రామా స్టోరీ నచ్చి సినిమా తీయడానికి రెడీ అయ్యాడు రాహుల్. ఇది తాతా మనవళ్ల మధ్య నడిచే కథ అట. సిటీ నుంచి గ్రామీణ వాతావరణానికి కథ జర్నీ ఉంటుందట.
ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమా మార్చిలో సెట్స్ మీదికి వెళ్లనుంది. చాలా వరకు కొత్త వాళ్లే ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేయబోతున్నారు. మరి రాహుల్ విన్నింగ్ స్ట్రీక్‌ను ఈ సినిమా కూడా కొనసాగిస్తుందేమో చూడాలి.
This post was last modified on January 25, 2024 9:42 am
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…