Movie News

ఫైటర్ హడావిడి ఎందుకు లేదంటే

మాములుగా హృతిక్ రోషన్ కున్న క్రేజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన సినిమా వస్తోందంటే క్లాసు మాస్ రెండు వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొంటాయి. 2019లో వార్ రిలీజైనప్పుడు వచ్చిన ఓపెనింగ్స్, సైరా లాంటి ప్యాన్ ఇండియా మూవీ మీద పూర్తిగా ఆధిపత్యం చెలాయించడం వెనుక ప్రధాన కారణం హృతిక్ తప్ప మరొకటి కాదు. విక్రమ్ వేదా ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా వసూళ్లు బాగానే వచ్చాయి. పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచేది. రెండేళ్ల గ్యాప్ తర్వాత హృతిక్ రోషన్ ఎల్లుండి ఫైటర్ గా రాబోతున్నాడు.

విచిత్రంగా క్రేజీ కాంబినేషన్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫైటర్ కి బజ్ రావడం లేదు. దీపికా పదుకునే గ్లామర్, అనిల్ కపూర్ లాంటి సీనియర్ ఆర్టిస్టుల అండ, అన్నింటిని మించి ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వందల కోట్ల బడ్జెట్ తో దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఆవిష్కరించిన గ్రాండియర్ ఈపాటికి హైప్ కి ఎక్కడికో తీసుకెళ్లాలి. అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి కానీ జవాన్, పఠాన్ స్థాయిలో కాదు కదా కనీసం డంకీని దాటేలా లేవని ట్రేడ్ ఖంగారు పడుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. యష్ రాజ్ ఫిలింస్ లాగా ఫైటర్ నిర్మాతలు సరైన మార్కెటింగ్ ప్లాన్ వేసుకోలేకపోయారు.

దీనికి తోడు ఇదేదో ఆకాశంలోనే జరిగే సినిమాగా ఆడియన్స్ అర్థం చేసుకోవడంతో టాక్ వచ్చాక చూద్దాంలే అనే ధోరణిలో ఉన్నారు. పబ్లిసిటీ ఎంత వీక్ గా ఉందంటే 3డి వెర్షన్ లో రిలీజవుతున్న సంగతి బుక్ మై షో ఓపెన్ చేస్తే తప్ప తెలియడం లేదు. పఠాన్ తర్వాత సిద్దార్థ్ ఆనంద్ చేసిన మూవీ ఇదే. సెన్సార్ అభ్యంతరాల మేరకు ఏకంగా ఒక పాటను తీసేయడం మాస్ మీద కొంత ప్రభావం చూపించేలా ఉంది. యాంటీ పాకిస్థాన్ ఎలిమెంట్ ని పదే పదే వాడుతున్న బాలీవుడ్ రచయితలు దానికి వీలైనంత త్వరగా మంగళం పడితే బెటర్. ఫైటర్ ఏమైనా కొత్తగా ఉంటుందేమో చూడాలి.

This post was last modified on January 23, 2024 5:07 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

18 mins ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

1 hour ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

2 hours ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

3 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

4 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

11 hours ago