ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కామెడీ రూపు రేఖలే మారిపోయాయి. బ్రహ్మానందం తరం కమెడియన్లు.. ఆ తరహా కామెడీ ఇప్పుడు వర్కవుట్ కావడం లేదు. కామెడీని కొత్తతరం ఆర్టిస్టులు టేకోవర్ చేశారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య లాంటి ఆర్టిస్టులు చేసే సటిల్ కామెడీనే ఈ తరం ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు.
ఈ వరుసలో చెప్పుకోదగ్గ మరో పేరు.. అభినవ్ గోమఠం. ఈ యువ నటుడి ప్రస్తావన తేగానే అందరికీ గుర్తుకొచ్చే సినిమా పేరు.. ఈ నగరానికి ఏమైంది? అందులో మేజర్ హైలైట్ అభినవ్ కామెడీనే. అతను చెప్పిన డైలాగులు, తన హావభావాలు.. మీమ్ మెటీరియల్స్‌గా మారిపోయి.. సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటాయి.
అభినవ్ డైలాగుల్లో అత్యంత పాపులర్ అయింది.. ‘మస్ట్ షేడ్స్ ఉన్నాయిరా’ అనే మాటే. ఎవరైనా ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతుంటే.. ‘మస్త్ షేడ్స్ ఉన్నాయిరా’ అనే మీమ్ వేస్తుంటారు సోషల్ మీడియా జనాలు. ఇప్పుడు ఈ మాటే సినిమా టైటిల్‌గా మారిపోయింది. ఆ పేరుతో రాబోతున్న సినిమాలో అభినవ్ గోమఠంయే హీరో కావడం విశేషం. ఈ రోజే ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
తిరుపతి రావు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఆరెం రెడ్డి, ప్రశాంత్, భవాని కాసుల నిర్మాతలు. సంజీవ్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే టీజర్ రిలీజ్ కాబోతోంది. దీని గురించి హింట్ ఇస్తూ.. ‘ఫస్ట్ షేడ్ రిలీజింగ్ సూన్’ అని పోస్టర్ మీద వేశారు. గత ఏడాది ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్‌తో కడుపుబ్బ నవ్వించిన అభినవ్.. హీరోగా పరిచయం కాబోతున్న తొలి చిత్రమిదే. మరి లీడ్ రోల్‌లో అతను ఏమేర మెప్పిస్తాడో చూడాలి.
This post was last modified on January 23, 2024 6:54 am
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…