ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకడు. కేజీఎఫ్ సలార్ సినిమాలతో అతను మామూలు క్రేజ్ సంపాదించలేదు. ప్రశాంత్ దర్శకత్వంలో నటించడానికి పెద్ద పెద్ద స్టార్లు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఇటీవలే సలార్ పార్ట్-1తో పలకరించిన ప్రశాంత్.. తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. నిజానికి అతను సలార్-1 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. కేజీఎఫ్-1 రిలీజ్ అవ్వగానే ప్రశాంత్ ముందుగా సినిమా కమిట్ అయింది తారక్ తోనే. కానీ దానికంటే ముందు సలార్ మొదలై.. పూర్తయింది. రిలీజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు కూడా వెంటనే తారక్- ప్రశాంత్ కాంబినేషన్ కార్యరూపం దాల్చేలా లేదు.
ప్రశాంత్ ఖాళీ అయ్యే సమయానికి తారక్ ఫ్రీగా లేడు. దేవరకు సంబంధించి కొంత షూట్, డబ్బింగ్ పనితో పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొనాల్సి ఉంది. మరోవైపు హిందీ సినిమా వార్-2 చిత్రీకరణకు హాజరు కావాలి. ఇంకో ఏడాది పాటు ఎన్టీఆర్.. ప్రశాంత్ కు అందుబాటులోకి రావడం కష్టమే. ఈ విషయంలో ఇద్దరికీ అండర్ స్టాండింగ్ ఉండడంతో ప్రశాంత్ ఆలోచన కూడా మారిపోయింది.
ముందు అనుకున్నట్లు ఎన్టీఆర్ సినిమా తర్వాత కాకుండా.. ముందే సలార్-2 చేసేయబోపోతున్నాడు. అది రిలీజ్ అయితే ఒక పని అయిపోతుంది. తర్వాత ప్రశాంతంగా ఎన్టీఆర్ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు ప్రశాంత్. అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలు కూడా ప్రశాంత్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ప్రశాంత్ కు కేజీఎఫ్ -3 రూపంలో ఇంకో కమిట్మెంట్ కూడా ఉంది.
This post was last modified on January 22, 2024 10:41 am
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…
2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…