సోలో రిలీజ్ వచ్చేలా చూస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఫిలిం ఛాంబర్ కు ఈగల్ నిర్మాతలు పంపిన లేఖా విన్నపానికి ఇంకా స్పందన రాని నేపథ్యంలో పోటీ తప్పదని అర్థమైపోయింది. సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడం వల్ల తమకు దక్కాల్సిన ప్రయోజనాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ డిమాండ్ చేయడంలో న్యాయముంది. అయితే ఊరి పేరు భైరవకోన, యాత్ర 2 ప్రొడ్యూసర్లను సంప్రదించకుండా కేవలం టిల్లు స్క్వేర్ వాయిదాని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సమస్యకు కారణమయ్యింది. ఏ పిఆర్ఓను అడిగినా దొరికే సమాచారాన్ని చెక్ చేసుకోలేదనే కామెంట్స్ ఓపెన్ గా వినిపిస్తున్నాయి.
ఈ లెక్కన ఈగల్ మరో మూడు సినిమాలతో తలపడక తప్పదు. ఈగల్ కి ఏషియన్ సంస్థ0 పంపిణిపరంగా మద్దతు ఇస్తుండగా, భైరవకోన-యాత్ర 2లకు మైత్రి అందండలు దక్కాయని వినిపిస్తోంది. వీటి పంపిణి వ్యవహారంలో దిల్ రాజు దూరంగా ఉన్నట్టు సమాచారం. కాంపిటీషన్ లేకుండా చూసుకుంటామని నిర్మాతల మండలి తరఫున మాట ఇచ్చింది ఆయనే కావడంతో ఏదైనా సమాధానం లేదా వివరణ ఇస్తే బాగుంటుందని రవితేజ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. పొరపాటో మరొకటో ఏదైనా ఇప్పుడు ఈగల్ ని ఒంటరిగా బాక్సాఫీస్ బరిలో దిగేలా చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది.
విడుదలకు పదిహేడు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈగల్ ప్రమోషన్లు ఇంకా ఊపందుకోలేదు. మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో బిజీగా ఉన్న రవితేజ దానికో బ్రేక్ ఇచ్చి ఈగల్ రిలీజ్ కు ముందు అవసరమైన పబ్లిసిటీలో భాగం కాబోతున్నాడు. సంక్రాంతి పండగను వదులుకోవడం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే సూపర్ హిట్ లేదా బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సిందే. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో పాటు టీమ్ మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ అయినప్పటికీ ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ పాయింట్ ని చూపించబోతున్నారట. పండగ తర్వాత వస్తున్న పెద్ద హీరో సినిమా కూడా ఇదే.
This post was last modified on January 21, 2024 12:56 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…