ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ తో పాటు నటిగా మంచి పేరు ఉన్న హీరోయిన్లలో తాప్సి పన్ను. దక్షిణాది సినిమాల్లో కేవలం గ్లామర్ తారలాగా ఉన్న తాప్సి.. హిందీలో మాత్రం మంచి మంచి పాత్రలతో నటిగా గొప్ప పేరు సంపాదించింది. తనకంటూ మార్కెట్ కూడా క్రియేట్ చేసుకుంది. పింక్, బద్లా, ముల్క్, నామ్ షబానా, తప్పడ్, హసీన్ దిల్రుబా లాంటి చిత్రాలు ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి.
ఇటీవల కింగ్ ఖాన్ షారుక్ సరసన నటించిన డంకీ సైతం బాగానే ఆడింది. ప్రస్తుతం దాదాపు అరడజను సినిమాలు చేతిలో ఉంచుకుంది తాప్సి. ఐతే కెరీర్ బాగానే సాగుతున్నప్పటికీ తాప్సీ వయసు 30 ఏళ్లు దాటిపోవడంతో తన పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలు అభిమానులు, మీడియా వాళ్ల నుంచి ఎదురవుతున్నాయి.
ఐతే పెళ్లి ఎప్పుడో చెప్పట్లేదు కానీ.. ఎవరిని వివాహమాడుతాననే విషయం మాత్రం తాప్సి క్లారిటీ ఇచ్చేసింది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో గతంలో తాప్సి ప్రేమలో ఉంది. ఐతే ఈ మధ్య వాళ్లిద్దరూ కలిసి కనిపించడం లేదు. మరి తాప్సి అతడితోనే రిలేషన్షిప్‌లోనే ఉందో లేదో అన్న సందేహాలు కలిగాయి. కానీ తాను ఇప్పటికీ మథియాస్ తోనే ఉన్నట్లుగా తాప్సి క్లారిటీ ఇచ్చింది.
పదేళ్ల క్రితం సౌత్ సినిమాల నుంచి బాలీవుడ్లోకి అడుగుపెట్టే సమయంలో మథియాస్ తో తనకు స్నేహం మొదలైందని.. అతను తను ఎంతగానో అర్థం చేసుకున్నాడని.. తనతో ఎంతో సంతోషంగా ఉన్నానని తాప్సి చెప్పింది. మథియాస్ ను ఎప్పటికే వదిలి పెట్టనని.. మరో వ్యక్తితో రిలేషన్షిప్ లోకి వెళ్ళే ఉద్దేశమే తనకి లేదని తాప్సి స్పష్టం చేసింది.
This post was last modified on January 19, 2024 9:24 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…