నూటా యాభైకి పైగా సినిమాలతో దశాబ్దాల తరబడి టాలీవుడ్ అగ్ర స్థానాన్ని అనుభవించిన చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇవ్వబోతోందనే వార్త నిన్న సాయంత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాని ఊపేసింది. అధికారిక వర్గాల నుంచి సమాచారం లేకపోయినప్పటికీ క్షణాల్లో న్యూస్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ తమ ఆనందాన్ని పంచుకోవడం మొదలుపెట్టారు. నిజానికి అఫీషియల్ గా ఎలాంటి నోట్ రాలేదు. అయితే ప్రకటనలకు ముందు లీకులు సహజమే కాబట్టి వాస్తవం లేకుండా మరీ ఇంత స్థాయిలో ప్రచారం జరగకపోవచ్చు. కన్ఫర్మేషన్ అయితే రాలేదు.
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారానికి సంబంధించిన ధృవీకరణ జరిగేలా ఉంది. 2006లో పద్మ భూషణ్ అందుకున్న మెగాస్టార్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొన్నేళ్ళకే కాంగ్రెస్ లోకి విలీనం చేసి ఇప్పుడు పూర్తిగా సినిమాలకే అంకింతమయ్యారు. పద్మవిభూషణ్ ఆయన నటనకు ఇస్తున్న గౌరవం కాదు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది రక్త నేత్ర దానాలు చేయడంతో పాటు కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణి, సినీ కార్మికులకు నిత్యావసరాల సరుకుల అందజేత లాంటి ఎన్నో కార్యక్రమాలు దగ్గరుండి జరిపించారు.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని అన్ని విధాలుగా అర్హత ఉందని తేలాకే నిర్ణయం తీసుకుని ఉంటారని ఢిల్లీ టాక్. ఇప్పటిదాకా మూడు వందల పై చిలుకు మాత్రమే పద్మభూషణ్ పురస్కారం అందుకున్న వాళ్లలో ఉన్నారు. చిరంజీవికి వాళ్ళ సరసన చోటు దక్కితే అంతకన్నా గర్వకారణం అభిమానులకు మరొకటి ఉండదు. అదేదో అఫీషియల్ గా చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో అడుగు పెట్టడానికి చిరు సిద్ధమవుతున్నారు. పద్మవిభూషణ్ వార్త గురించి మెగా వర్గాలు కానీ టాలీవుడ్ పెద్దలు కానీ స్పందించలేదు. సో ఖరారయ్యాక శుభవార్తను పంచుకోవచ్చు.
This post was last modified on January 18, 2024 10:44 am
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…