సలార్ బ్లాక్ బస్టర్ అయినందుకు హోంబాలే ఫిలిమ్స్ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. హీరో ప్రభాస్ తో పాటు క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం హాజరయ్యింది. సినిమా టోన్ కు తగ్గట్టు అందరూ నల్లని దుస్తుల్లో రావడం గమనార్హం. చాలా మంది సతీసమేతంగా విచ్చేయడం విశేషం. అయితే వేడుకలో అఖిల్ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అది కూడా వెరైటీగా తలకు బ్యాండ్ పెట్టుకుని, భుజం చుట్టూ వార్మ్ క్లాత్ (వస్త్రం) లాంటిది కప్పుకుని డిఫరెంట్ గా కనిపించాడు. ఇంకేముంది సలార్ 2లో అఖిల్ ఉన్నాడనే యాంగిల్ లో ఫ్యాన్స్ వెరైటీ విశ్లేషణలు, అంచనాలు మొదలుపెట్టారు.
దీనికి సంబంధించిన కారణాలు స్పష్టంగా తెలియలేదు కానీ ప్రభాస్ ఆహ్వానం మీదే వచ్చాడని ఇన్ సైడ్ టాక్. అయితే డార్లింగ్ పిలవాలనుకుంటే చాలా పెద్ద లిస్టు అవుతుంది. కానీ ప్రత్యేకంగా అఖిల్ కు మాత్రమే ఇన్విటేషన్ వెళ్తే ఎవరికైనా సందేహం రావడం సహజం. హోంబాలే ఫిలిమ్స్ తనతో ఏదైనా మూవీ ప్లాన్ చేస్తుందేమో క్లారిటీ లేదు కానీ సంథింగ్ సంథింగ్ తరహాలో ఏదో గుట్టు అయితే ఉంది. యూట్యూబ్ ఛానల్ లో అఫీషియల్ గా విడుదల చేసిన వీడియోలో అఖిల్ ని జస్ట్ ఒక ఫ్రేమ్ లో మాత్రమే చూపించారు. ఓపెన్ టెర్రస్ మీద చాలా గ్రాండ్ గా జరిగింది.
దీని సంగతి కాసేపు పక్కనపెడితే ఇలా ప్రైవేట్ ఈవెంట్స్ లో తప్ప అఖిల్ కొత్త సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో అర్థం కాక అభిమానుల ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి. యువి క్రియేషన్స్ ప్లాన్ చేసిన ప్యాన్ ఇండియా మూవీ లాక్ అయ్యింది కానీ ఎందుకనో మొదలుపెట్టడంలో ఆలస్యం చేస్తున్నారు. ఏజెంట్ డిజాస్టర్ దెబ్బకు అఖిల్ బాగా నెమ్మదించాడు. కొడుకు విషయంలో జోక్యం చేసుకోనని, పూర్తి స్వాతంత్రం తనదేనని నాగార్జున చెప్పేశాడు కాబట్టి కెరీర్ ప్లానింగ్ విషయంలో అఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. సంక్రాంతికి అనౌన్స్ మెంట్ వస్తుందనుకుంటే అదేమీ జరగలేదు.
This post was last modified on January 16, 2024 8:14 pm
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో…
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఎముకలు కొరికే చలిలో సైతం వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష…
పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న సౌత్ దర్శకుల్లో అట్లీ ఒకడు. రాజా రాణి, తెరి, మెర్శల్, బిగిల్ లాంటి…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు, విడుదల వ్యవహారం సంచలనం…