ఒక దర్శకుడు ఇచ్చిన బ్లాక్ బస్టర్ ప్రభావం ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఫిలిం మేకర్స్ ని వెంటాడుతూనే ఉంటుంది. ఎంత వద్దనుకున్నా దానికి లోబడే తమ సినిమాల్లో సన్నివేశాలను పేర్చుకుంటారు. ఇప్పుడీ ప్రస్తావన సుకుమార్ గురించి. 2018లో వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరోని చెవులు సరిగా వినిపించని వాడిగా చూపించి, గ్రామ రాజకీయాలకు ముడిపెట్టి 1985 నాటి కథని క్లాసు మాసు ఊగిపోయేలా చెప్పడం మాటలు కాదు. ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యామిలీ సెటప్ ని అత్యంత సహజంగా రాసుకున్న విధానం డిక్షనరీ లాంటిది.
అందుకే ఆదిపినిశెట్టి చనిపోతే దానికి పెట్టిన పాథోస్ సాంగ్ కి, ఆర్టిస్టుల నటనకు థియేటర్లో జనాలు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. అంత బలంగా ఎమోషన్ పండింది. అప్పటి నుంచి ఈ ఫార్ములా ఎందరు వాడుకున్నారో లెక్క చెప్పడం కష్టం. పాతవి వద్దు కానీ ఫ్రెష్ వే చూద్దాం. నా సామిరంగలో అల్లరి నరేష్ ని విలన్లు మట్టుబెట్టాక నాగార్జునతో తన అనుబంధాన్ని చూపిస్తూ అంత్యక్రియలకు పాట పెట్టడం ఎంత వద్దన్నా సుక్కు మార్కే. హనుమాన్ లో వరలక్ష్మి శరత్ కుమార్ చావుకు సైతం అచ్చం ఇదే తరహా ట్రీట్ మెంట్ తీసుకున్నాడు ప్రశాంత్ వర్మ. రెండూ కీలక మలుపులు.
అలా అని పాత సినిమాల్లో పాత్రలు చనిపోలేదని కాదు, ఇంతకన్నా గొప్పగా చూపించలేదని కాదు. శవయాత్రని ఎక్కువగా చూపిస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరన్న భయం కొంత కాలం పాటు డైరెక్టర్స్ వీటిని ఎక్కువ హైలైట్ చేయకుండా ఆపింది. కానీ రంగస్థలంలో ఎప్పుడైతే ఆడియన్స్ బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారో అప్పటి నుంచి ఎందరో ఫాలో అయ్యారు. గత మూడు నాలుగేళ్లలో కనీసం పదికి పైగా సినిమాల్లో ఇలాంటివి చూడొచ్చు. అన్నట్టు పుష్ప 2 ది రూల్ లోనూ ఇదే టైపు బలమైన ఎమోషనల్ బ్లాక్ పెట్టారట సుకుమార్. ఈసారి ఎవరి వంతో ఏదైనా లీక్ వస్తే కానీ చెప్పలేం.
This post was last modified on January 16, 2024 6:05 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…