Movie News

బాహుబలిని దాటేందుకు హనుమాన్ పరుగులు

ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద హనుమాన్ నమ్మశక్యం కానీ ఫీట్లు చేస్తున్నాడు. మహేష్ బాబుకి చాలా బలమైన బేస్ ఉన్న యుఎస్ లో గుంటూరు కారంని ఎక్కడో మైళ్ళ దూరంలో వెనక్కు నెట్టేసి ఏకంగా రాజమౌళి రికార్డుల మీద కన్నేస్తున్నాడు. కేవలం నాలుగు రోజులకే 3 మిలియన్ మార్క్ దాటేసి సరికొత్త బెంచ్ మార్కులను నెలకొల్పుతున్నాడు. ప్రస్తుతం హనుమాన్ కన్నా ముందు వరసలో ఉన్నవాటిని చూస్తే ఆదిపురుష్ 3.16, సాహు 3.23, భరత్ అనే నేను 3.41, రంగస్థలం 3.51, అల వైకుంఠపురములో 3.63, బాహుబలి బిగినింగ్ 8.47, సలార్ 8.90, ఆర్ఆర్ఆర్ 14.83, బాహుబలి కంక్లూజన్ 20.76 మిలియన్లతో ఉన్నాయి.

వీటిలో హనుమాన్ చాలా సులభంగా బాహుబలి బిగినింగ్ ని ఫుల్ రన్ లో దాటడం ఖాయంగా కనిపిస్తోంది. సలార్ ని క్రాస్ చేసే అవకాశాలు కొట్టిపారేయలేం. కాకపోతే ఇప్పుడున్న దూకుడుని ఇదే తరహాలో కొనసాగించాల్సి ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు సాధ్యమేననే అంచనాలో ఉన్నారు. జనవరి 22 అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ఇండియాకు రాలేకపోయినా ఎన్ఆర్ఐల్లో జై శ్రీరామ్ భావన బలంగా తిరుగుతోంది. దాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నారు కూడా. అందులో భాగంగానే హనుమాన్ ని థియేటర్లో ఎంజాయ్ చేసే వాళ్ళ సంఖ్య భారీగా ఉండబోతోంది.

ఎందరో టాలీవుడ్ హీరోలకు కలగా మిగిలిపోయిన 3 మిలియన్ మార్క్ ని తేజ సజ్జ అందుకోవడం షాకే. ఇది తన ఇమేజ్ వల్ల వచ్చిందని కాదు కానీ ఇంత భారీ ఫాంటసీ డ్రామాలో అతనే హీరో కావడం ఖచ్చితంగా కెరీర్ పరంగా చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. దగ్గరలో చెప్పుకోదగ్గ కొత్త రిలీజులేవి లేవు. నెలాఖరున వచ్చేవి కూడా హనుమాన్ కి అడ్డంకిగా నిలిచేవి కాదు. సో ఎంత లేదన్నా కనీసం రెండు వారాల పాటు హనుమాన్ విధ్వంసం కొనసాగటం ఖాయం. అక్కడి ఆడియన్స్ కి థాంక్స్ చెప్పేందుకు హనుమాన్ టీమ్ యుఎస్ ట్రిప్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉందట. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 

This post was last modified on January 16, 2024 3:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

1 hour ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

1 hour ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

2 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

2 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

3 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

3 hours ago